News October 22, 2025

పరవాడ సమీపంలో పేకాట శిబిరంపై దాడి: సీఐ

image

పరవాడ మండలం నక్కవానిపాలెం సమీపంలో పేకాట శిబిరంపై మంగళవారం రాత్రి దాడులు నిర్వహించినట్లు సీఐ మల్లిఖార్జునరావు తెలిపారు. ముందుగా అందిన సమాచారం మేరకు నిర్వహించిన దాడుల్లో 11 మందిని అదుపులోకి తీసుకొని రూ.19 లక్షల నగదు, పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. కొందరు వ్యక్తులు పరారైనట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News October 24, 2025

డెత్ జర్నీ.. ఎప్పుడు ఏం జరిగింది?

image

☞ రా.10.30కి HYD-BLR బయలుదేరిన బస్సు
☞ బస్సులో 40 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు
☞ తెల్లవారుజామున 3-3:10 మధ్య కర్నూలు వద్ద బస్సు-బైక్ ఢీ
☞ ఇంధనం లీక్ అయ్యి చెలరేగిన మంటలు
☞ 19 మంది సజీవ దహనం, 21 మంది సురక్షితం
☞ రాష్ట్రపతి ముర్ము, పీఎం మోదీ, తెలుగు సీఎంల దిగ్భ్రాంతి
☞ PMNRF నుంచి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా
☞ బస్సును ఢీకొన్న ద్విచక్రవాహనదారుడు శంకర్ మృతి
☞ క్షతగాత్రులకు కొనసాగుతున్న చికిత్స

News October 24, 2025

నిర్మల్: ‘ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులుంటే కాల్ చేయండి’

image

​జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సన్న, దొడ్డు రకాలకు వేర్వేరుగా కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. తూకపు యంత్రాలకు స్టాంపింగ్‌ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. రైతులు ఇబ్బందులు పడకుండా టార్పాలిన్‌లు, సంచులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. రైతులకు ఏవైనా సమస్యలుంటే 91829 58858కు ఫోన్ చేయవచ్చని తెలిపారు.

News October 24, 2025

పల్నాడు: అవిశ్వాసానికి వేళాయె..!

image

మండల ప్రజా పరిషత్ అధ్యక్షుల పదవి కాలం 4 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో పల్నాడు జిల్లాలో పలుచోట్ల అవిశ్వాస తీర్మానాలు పెట్టడానికి రంగం సిద్ధం చేస్తూ ఉండటంతో రాజకీయ అలజడి ప్రారంభమైంది. కారంపూడిలో ఇప్పటికే అవిశ్వాసం ఆమోదం పొందడంతో ఎంపీపీ మేకల శారద పదవి కోల్పోయారు. ముప్పాళ్ల ఎంపీపీపై అవిశ్వాస తీర్మానానికి సభ్యులు నోటీసులు ఇచ్చారు. మరి కొన్ని చోట్ల ఇవే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.