News October 22, 2025
శ్రీశైలంలో గర్భాలయ అభిషేకాల నిలుపుదల

కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం దేవస్థానంలో భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయ, సామూహిక అభిషేకాలను తాత్కాలికంగా నిలిపేశారు. శని, ఆది, సోమవారాల్లో అమ్మవారి కుంకుమార్చనను ఆశీర్వచన మండపంలో నిర్వహించనున్నారు. రుద్ర హోమం, చండీ హోమం, నిత్యకల్యాణం వంటి ఆర్జిత సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి.
Similar News
News October 24, 2025
బస్సు ప్రమాదం: తెలంగాణ ప్రభుత్వం పరిహారం

కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో రాష్ట్రవాసులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించడమే కాకుండా పరిహారం ప్రకటించింది. <<18088909>>మృతుల<<>> కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున రేవంత్ సర్కార్ పరిహారం ప్రకటించింది. ఇప్పటికే హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసి.. ప్రత్యేకంగా ఇద్దరు అధికారులను నియమించింది. హెల్ప్ లైన్ నంబర్స్: 9912919545, 9440854433.
News October 24, 2025
సిద్దిపేట: మద్యం టెండర్లు.. గతంలో కంటే తక్కువ!

సిద్దిపేట జిల్లాలో ఉన్న మద్యం దుకాణాలకు గతంతో పోలిస్తే కంటే తక్కువ దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 93 మద్యం దుకాణాలకు గత సంవత్సరం 4166 వేల దరఖాస్తులు రాగ 2025-2027 సంవత్సరానికి గాను 2782 దరఖాస్తులు వచ్చాయని ప్రోహిబిషన్, ఎక్సైజ్ సుపరింటెండెంట్ శ్రీనివాస్ మూర్తి తెలిపారు. గతంలో డిపాజిట్ రూ.2 లక్షలు కాగా ఈ సారి అది రూ.3 లక్షలకు పెంచడం గమనార్హం.
News October 24, 2025
బ్రెస్ట్ క్యాన్సర్‌ను నివారించే ఆహారాలివే..

ప్రస్తుతకాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారం, మంచి జీవనశైలిని పాటించడం వల్ల క్యాన్సర్ తీవ్రతను తగ్గించొచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే దానిమ్మ, సోయా ఉత్పత్తులు, బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, ఉసిరికాయ, పియర్, అవిసె గింజలు ఎక్కువగా తీసుకోవాలంటున్నారు. అలాగే ఆలివ్ ఆయిల్‌లో ఉండే పాలీఫెనాల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి.


