News October 22, 2025
అనకాపల్లి మార్కెట్‌లో పెరిగిన బెల్లం ధరలు

అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో మంగళవారం బెల్లం ధరలు పెరిగా గతంలో ఎన్నడూ లేని విధంగా 1వ రకం 100 కిలోల బెల్లం ధర రూ.6,090కు పెరిగింది. మార్కెట్‌కు 871 బెల్లం దిమ్మలు వచ్చాయి. వీటిలో 1వ రకం 489, రెండవ రకం 244, నల్ల బెల్లం 128 ఉన్నాయి. 2వ రకం రేటు రూ.4,600 పలికింది. 3వ రకం రూ.4,000 పలికకింది. నాగుల చవితి వరకు ఇవే రేట్లు కొనసాగే అవకాశాలు ఉన్నట్లు వ్యాపారులు భావిస్తున్నారు.
Similar News
News October 24, 2025
నవీపేట్ శివారులో మహిళ మృతదేహం

నిజామాబాద్ జిల్లా నవీపేట్ నుంచి నాగేపూర్ వెళ్లే రహదారి మధ్యలో హనుమాన్ టెంపుల్ పక్క గల శివారులో గుర్తుతెలియని మహిళా మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. నవీపేట్ ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిపల్లి గ్రామానికి చెందిన మహిళగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఘటన యొక్క పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
News October 24, 2025
కర్నూలు బస్సు ప్రమాదంలో ఇంకొల్లు యువతి మృతి

కర్నూలు జిల్లాలో శుక్రవారం జరిగిన బస్సు ప్రమాదంలో ఇంకొల్లులోని పూసపాడుకు చెందిన గన్నమనేని ధాత్రి (27) మృతి చెందింది. ఈ ఘటనపై పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ధాత్రి కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పరామర్శిస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. యువతి మరణ వార్త గ్రామంలో విషాద ఛాయలు నింపింది.
News October 24, 2025
ఈ రోజు రాత్రి ఢిల్లీకి CM రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుల ఎంపికపై చర్చించనున్నారు. దానికోసం ఈ రోజు రాత్రి దేశ రాజధానికి బయల్దేరనున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు రాష్ట్ర ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. సీఎం 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.


