News October 22, 2025
ఖమ్మం: 200 ఉద్యోగాలు.. రేపే అవకాశం

ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకుల కోసం అక్టోబర్ 23న ఉదయం 10 గంటలకు టేకులపల్లి ప్రభుత్వ ఐటీఐలో జె.వి.జి మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. హైదరాబాద్‌లోని ఏరో స్పేస్, ఎలివేటర్స్ తయారీ యూనిట్లలో దాదాపు 200 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఐటీఐ, ఇంటర్, డిగ్రీ అర్హత గల 19-23 ఏళ్ల యువతీ యువకులు హాజరుకావాలని సూచించారు.
Similar News
News October 24, 2025
ఖమ్మం: మైనార్టీలకు వృత్తి శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం

అర్హులైన మైనార్టీలకు వివిధ రంగాలలో వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు కల్పించేందుకు శిక్షణా సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ముజాహిద్ తెలిపారు. ప్రభుత్వ, జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థతో (ఎన్‌ఎస్‌డీసీ) అనుబంధం ఉన్న సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆసక్తిగల శిక్షణా సంస్థలు నవంబర్ 6వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
News October 24, 2025
15 రోజుల్లో దరఖాస్తులు పరిష్కరించాలి: కలెక్టర్ అనుదీప్

ఖమ్మం: పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సదస్సు దరఖాస్తులను 15 రోజుల్లోగా పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌లతో కలిసి రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. దరఖాస్తుల పరిష్కారం, ఇతర అంశాలపై చర్చించి, తగు సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
News October 24, 2025
ఖమ్మం: టెండర్లకు భారీ స్పందన.. రూ.133 కోట్ల ఆదాయం

ఖమ్మం జిల్లాలో మద్యం దుకాణాలకు టెండర్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. ఖమ్మం జిల్లాలో ఉన్న మొత్తం 116 దుకాణాలకుగాను ఆఖరి రోజు వరకు 4,435 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి నాగేందర్ రెడ్డి తెలిపారు. ఈ దరఖాస్తుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.133 కోట్ల ఆదాయం సమకూరినట్లు పేర్కొన్నారు. ఈ నెల 27న డ్రా పద్ధతిలో లైసెన్సు దారులను ఎంపిక చేయనున్నారు.


