News October 22, 2025
నేడు కామారెడ్డిలో జాబ్ మేళా

కామారెడ్డిలోని కలెక్టరేట్‌లో ఫస్ట్ ఫ్లోర్‌లోని 21వ రూమ్‌లో బుధవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రజని కిరణ్ తెలిపారు. ప్రైవేటు కంపెనీలో సేల్స్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ మేనేజర్స్, అసిస్టెంట్ మేనేజర్స్ ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు. అభ్యర్థుల వయసు 30 సంవత్సరాల లోపు ఉండాలన్నారు. మరిన్ని వివరాల కోసం 9885453222 నంబర్‌కు సంప్రదించాలన్నారు.
Similar News
News October 22, 2025
షరతులతో సందర్శనకు అనుమతి: అనకాపల్లి ఎస్పీ

రాజయ్యపేట గ్రామాన్ని సందర్శించే 48 మందికి వైసీపీ నాయకులకు షరతులతో అనుమతి ఇచ్చినట్లు ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. ర్యాలీ, రోడ్ షో, భారీ సమావేశం నిర్వహించడానికి అనుమతి లేదన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా చట్టాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీడియా సమావేశం నిర్వహించే సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని స్పష్టం చేశారు.
News October 22, 2025
సినీ ముచ్చట్లు

*ప్రభాస్-హను రాఘవపూడి సినిమా థీమ్‌ను తెలుపుతూ కొత్త పోస్టర్ విడుదల. రేపు 11.07AMకు టైటిల్ పోస్టర్ రిలీజ్ చేస్తామని ప్రకటన
*నవంబర్ 14న ‘డ్యూడ్’ ఓటీటీ విడుదలకు నెట్‌ఫ్లిక్స్ ప్లాన్!
*త్రివిక్రమ్-విక్టరీ వెంకటేశ్ కొత్త సినిమాలో హీరోయిన్‌గా KGF బ్యూటీ శ్రీనిధి శెట్టి ఎంపిక
*ముంబైలో శిల్పాశెట్టి రెస్టారెంట్.. రోజుకు రూ.2-3 కోట్ల ఆదాయం!
News October 22, 2025
అతిభారీ వర్షాలు.. ప్రయాణాలు చేయవద్దని హెచ్చరిక

AP: దక్షిణకోస్తా, రాయలసీమలో అతిభారీ వర్షాల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో హోం మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, అత్యవసరం అయితే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయవద్దని హెచ్చరించారు. NDRF, SDRF, పోలీసు, ఫైర్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ఎమర్జెన్సీలో ప్రజలు 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయాలని సూచించారు.