News April 9, 2024
విశాఖ: ముగిసిన టెన్త్ మూల్యాంకనం

టెన్త్ జవాబుపత్రాల మూల్యాంకనం సోమవారంతో ముగిసింది. ఈనెల ఒకటో తేదీన జ్ఞానాపురం జూబ్లీ హైస్కూలులో మూల్యాంకనం ప్రారంభమైంది. ఎనిమిది రోజుల్లో మొత్తం 1,76,924 జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారు. అత్యధికంగా ఇంగ్లిష్ సబ్జెక్టు సంబంధించి 29 వేలు, సోషల్ స్టడీస్‌లో 28 వేల పత్రాలు జిల్లాకు వచ్చాయి. మూల్యాంకనం కోసం 104 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 624 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 208 మంది సహాయకులు పనిచేసారు.
Similar News
News October 4, 2025
బీచ్‌లను సుందరంగా తీర్చిదిద్దండి: జీవీఎంసీ కమిషనర్

విశాఖలో త్వరలో జరగనున్న పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్, ఐఎఫ్ఆర్ దృష్ట్యా బీచ్‌లను పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్దాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. కాలువల ద్వారా వ్యర్థాలు సముద్రంలో కలవకుండా ఉండేందుకు కాలువల వద్ద వెంటనే స్క్రీన్లు, ఆధునిక వలలు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు.
News October 4, 2025
ఎన్‌ఏడీలో తప్పనున్న ట్రాఫిక్ కష్టాలు..!

విశాఖలోని అత్యంత రద్దీ ప్రాంతమైన ఎన్‌ఏడీ జంక్షన్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు పనులు వేగవంతమయ్యాయి. ఎన్‌ఏడీ నుంచి కాకానినగర్ వరకు 11 మీటర్ల వెడల్పుతో తేలికపాటి వాహనాల కోసం నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2025 చివరి నాటికి దీనిని పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది అందుబాటులోకి వస్తే గాజువాక వైపు వెళ్లే వాహనదారుల ప్రయాణం సులభతరం కానుంది.
News October 4, 2025
విశాఖ ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా

విశాఖలోని అన్నదాన కార్యక్రమంలో గంజిపడి <<17913036>>చిన్నారులు గాయపడిన<<>> ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ ప్రమాదంలో 20 మంది చిన్నారులను ఆస్పత్రికి తరలించగా, ఆరుగురు చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. స్వల్ప గాయాలైన ఇతరులను డిశ్చార్జ్ చేశామని, బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని కలెక్టర్ వెల్లడించారు.