News October 22, 2025
తిరుపతి జిల్లాలో కాలేజీలకు సెలవు

తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుపతి జిల్లాలోని అన్ని స్కూళ్లకు బుధవారం సెలవు ప్రకటించారు. తాజాగా కాలేజీలకు సైతం సెలవు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. చిత్తూరు జిల్లాలోని స్కూళ్లకు సైతం హాలిడే ఇచ్చారు. ఆ జిల్లాలోని కాలేజీ సెలవులపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. మీకు సెలవు ఇచ్చారా? లేదా? కామెంట్ చేయండి.
Similar News
News October 24, 2025
వర్గల్: సమాజ మార్పుకు దిక్సూచిలా ఉండాలి: గవర్నర్

విద్యార్థులు సమాజ మార్పుకు దిక్సూచిలా ఉండాలని, విజ్ఞానాన్ని వినియోగించి వ్యవసాయ ఉత్పత్తిని, సాంకేతికతను, పరిశోధనలను అభివృద్ధి చేయాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచించారు. వర్గల్ మండలంలోని కావేరి విశ్వవిద్యాలయం, కావేరి సీడ్ కంపెనీని సందర్శించి ప్రభుత్వం విద్య రంగంలో తీసుకుంటున్న కార్యక్రమాల గురించి గవర్నర్ తెలిపారు. కావేరి యూనివర్సిటీని సందర్శించి యూనివర్సిటీ ప్రొఫైల్‌ను పరిశీలించారు.
News October 24, 2025
గాజా డీల్‌ను బలహీనపరిస్తే నెతన్యాహుపై తీవ్ర చర్యలు!

వెస్ట్ బ్యాంక్ <<18087139>>స్వాధీనానికి <<>>ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుండటంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. గాజా డీల్‌ను ఆ దేశ PM నెతన్యాహు బలహీనపరిస్తే ట్రంప్ తీవ్ర చర్యలు తీసుకుంటారని ఓ US అధికారి హెచ్చరించారు. ‘ట్రంప్‌తో క్లిష్టమైన దౌత్య పరిస్థితులను నెతన్యాహు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ ఆయన గాజా డీల్‌ను నిర్వీర్యం చేస్తే ట్రంప్ తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉంది’ అని చెప్పారు.
News October 24, 2025
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో 7 ఆఫీసర్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. LLB/LLM ఉత్తీర్ణులైనవారు నవంబర్ 14 నుంచి డిసెంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి వయోపరిమితిలో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.500. CLAT-2026లో అర్హత, డాక్యుమెంట్ వెరిఫికేషన్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.


