News October 22, 2025
ఇంటర్ పరీక్షల్లో మార్పులు!

AP: ఇంటర్ పరీక్షల్లో విద్యాశాఖ మార్పులు చేసింది. ఇకపై గణితం ఒకే పేపర్ 100 మార్కులకు ఉంటుంది. 35 మార్కులొస్తే పాస్ అవుతారు. బయాలజీ (BiPC), ఫిజిక్స్, కెమిస్ట్రీలో 85 మార్కులకు పరీక్షలుంటాయి. ఫస్టియర్‌లో 29, సెకండియర్‌లో 30 మార్కులు వస్తే పాసవుతారు. ప్రస్తుతం సెకండియర్ చదివేవారికి ఇవి వర్తించవు. కాగా 1st అటెంప్ట్‌లో 4 పేపర్లలో 35% మార్కులొచ్చి, ఓ పేపర్లో 30% వచ్చినా పాసేనని అధికారులు చెప్తున్నారు.
Similar News
News February 19, 2026
ఫోన్ పేలో కొత్త ఫీచర్.. పిన్ అవసరం లేకుండానే..

UPI పేమెంట్ల కోసం బయోమెట్రిక్ వ్యవస్థ తీసుకొచ్చినట్లు ఫోన్ పే ప్రకటించింది. పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా ఫింగర్ ప్రింట్/ఫేసియల్ రికగ్నిషన్‌తో పేమెంట్ పూర్తవుతుందని తెలిపింది. ప్రస్తుతం రూ.5వేల వరకు చేసే ట్రాన్సాక్షన్లకే ఈ ఫీచర్ తెచ్చామంది. ఇందుకోసం ఫోన్ పే యాప్ ప్రొఫైల్‌కు వెళ్లి మేనేజ్ పేమెంట్స్‌పై ట్యాప్ చేయాలంది. అనంతరం బయోమెట్రిక్ పే ఐకాన్‌పై క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకోవాలని తెలిపింది.
News February 19, 2026
టెన్త్ పరీక్షలకు వైభవ్ డుమ్మా.. తండ్రి ఏమన్నారంటే?

భారత U19 సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ టెన్త్ పరీక్షలకు <<19149713>>హాజరుకాకపోవడంపై<<>> తండ్రి సంజీవ్ స్పందించారు. IPLపై ఫోకస్ చేయడం కోసమే ఎగ్జామ్స్ రాయలేదని చెప్పారు. ‘వైభవ్ తెలివైన విద్యార్థి. గతంలో అన్ని సబ్జెక్టులలో 90% పైగా మార్కులు సాధించేవాడు. కానీ ఇప్పుడు పరీక్షలకు వెళితే ఆటపై ఫోకస్ చేయలేడు. ప్రస్తుతం RR ఆటగాళ్లతో కలిసి నాగ్‌పూర్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది పరీక్షలు రాస్తాడు’ అని తెలిపారు.
News February 19, 2026
అజహరుద్దీన్ పదవికి గండం… AICCలో చర్చ

TG: మంత్రిగా అజహరుద్దీన్ ప్రమాణం చేసి మూడున్నర నెలలైంది. కానీ ఇంతవరకూ MLA/MLC కాలేదు. గవర్నర్ కోటాలో MLCని చేసినా సుప్రీంకోర్టు ఆదేశాలతో అమలు నిలిచింది. మంత్రి అయ్యాక 6 నెలల్లో శాసనసభ/మండలిలో సభ్యుడు కాకపోతే పదవి కోల్పోతారు. ఈ నేపథ్యంలో ఓ MLCతో రిజైన్ చేయించి ఆ స్థానంలో అజహర్‌ను ఎంపిక చేయాలని TPCC నేతలతో ఢిల్లీలో భేటీలో హైకమాండ్ సూచించింది. త్యాగం చేసే నేతకు ఇచ్చే పదవిపై నిర్ణయం జరగాల్సి ఉంది.


