News October 22, 2025
నెల్లూరు: కాలేజీలకు సెలవు

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు అధికారులు ప్రకటించారు. అలాగే అన్ని జూనియర్ కాలేజీలకు సైతం బుధవారం హాలిడే ఇవ్వాలని RIO వరప్రసాద్ ఆదేశించారు. ఈ ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు డిగ్రీ పరీక్షలు సైతం వాయిదా పడిన విషయం తెలిసిందే. మీకు సెలవు ఇచ్చారా? లేదా? కామెంట్ చేయండి.
Similar News
News October 22, 2025
కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు: కలెక్టర్

భారీ వర్షాల నేపథ్యంలో అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోలు రూంను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. వర్షాల వలన ఇబ్బందులు తలెత్తితే కంట్రోలు రూం నెంబర్లు : 0861 2331261, 7995576699 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం తెలపవచ్చని కలెక్టర్ తెలిపారు.
News October 22, 2025
నెల్లూరు: దంపతుల ఆత్మహత్యాయత్నం.. భర్త మృతి

నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడిపల్లిపాడులో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక మురళీధర్, అతని భార్య జలజ పురుగులు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. మురళీధర్ మృతి చెందగా.. జలజను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుత ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉంది. సమాచారం తెలుసుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు ఆరా తీస్తున్నారు.
News October 22, 2025
నావూరు పెద్దవాగును పరిశీలించిన జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల

పొదలకూరు మండలం నావూరుపల్లి వద్దనున్న నావూరు పెద్దవాగును బుధవారం సాయంత్రం జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల పరిశీలించారు. తుఫాన్ నేపథ్యంలో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం, మూడు గ్రామాలకు రాకపోకలు బంద్ అవడంతో ఆమె వాగును పరిశీలించారు. తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.