News October 22, 2025
చిత్తూరు CDCMS పర్సన్ ఇన్‌ఛార్జ్ జేసీ

ఉమ్మడి చిత్తూరు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(CDCMS)కి అఫిషియల్ పర్సన్ ఇన్‌ఛార్జ్‌గా జాయింట్ కలెక్టర్ విద్యాధరిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబరు 26వ తేదీ వరకు లేదా తిరిగి ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఆమె ఆ పదవిలో కొనసాగుతారు. గతంలో నియమించిన సుబ్రహ్మణ్యం నాయుడు మృతిచెందిన సంగతి తెలిసిందే.
Similar News
News October 22, 2025
చిత్తూరు జిల్లాలో రేపు కూడా పాఠశాలలకు సెలవు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని పాఠశాలలకు గురువారం కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్టు డీఈఓ వరలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని యాజమాన్య పాఠశాలలు ఆదేశాలను పాటించాలని కోరారు.
News October 22, 2025
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: చిత్తూరు కలెక్టర్

చిత్తూరు జిల్లాలో విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లాస్థాయి అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రాజెక్టుల పరిస్థితి, ప్రమాదకర చెరువుల పరిస్థితిపై సమీక్షించారు. క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, వైద్య అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు.
News October 22, 2025
చిత్తూరులో కంట్రోల్ రూమ్

చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తాయన్నారు. లోతట్టు ప్రజలు వాగులు, వంకల వైపు వెళ్లరాదని సూచించారు. అత్యవసరమైతే ప్రజలు బయటకు రావాలని కోరారు. వర్షాలతో ఏదైనా ఇబ్బంది ఎదురైతే కంట్రోల్ రూము నంబర్లు 9491077325, 08572 242777కు కాల్ చేయాలని కోరారు.