News October 22, 2025
పాలమూరు: మద్యం షాపు దరఖాస్తుల గడువు రేపటితో ముగింపు

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు ఈనెల 23తో ముగియనుంది. ఈసారి 10 వేలకు పైగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు అంచనా వేయగా, గడువు పొడిగించినా ఇప్పటివరకు కేవలం 5,188 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. మరో రెండు రోజులు గడువు ఉండటంతో దరఖాస్తుల సంఖ్య పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
Similar News
News October 24, 2025
పెద్దపల్లి జిల్లాలో వరుస దొంగతనాలు

రామగుండం కమిషనరేట్ పరిధిలో దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఈ మధ్యకాలంలో కమిషనరేట్ పరిధిలో దొంగతనాలు ఎక్కువగా జరగడం ఈ సంకేతాన్ని సూచిస్తోంది. రామగిరి(M)లో పది రోజుల క్రితం రెండు ఇళ్లలో 3 రోజుల వ్యవధిలో చోరీలకు పాల్పడిన ఘటన మరవక ముందే ముత్తారం(M) ఓడేడు గ్రామంలో గుజ్జు జంగా రావు ఇంటిలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి ఆరు తులాల బంగారం, 2.80 లక్షల నగదు దోచుకెళ్లారు.
News October 24, 2025
KMR: జిల్లా జాగృతి యువజన అధ్యక్షుడిగా ఆదిల్

తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా మహమ్మద్ ఆదిల్ నియమితులయ్యాడు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం హైదరాబాద్‌లో రాష్ట్ర, జిల్లాల అనుబంధ విభాగాల నూతన కార్యవర్గాలను ప్రకటించారు. ఈ నియామకాలు తక్షణమే అమలులోకి వస్తాయని ఆమె వెల్లడించారు. ఆదిల్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఇచ్చిన పదవికి న్యాయం చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
News October 24, 2025
వీరి మరణానికి బాధ్యులెవరు?

బస్సు <<18088805>>ప్రమాదాలకు<<>> ప్రధాన కారణం సేఫ్టీ రూల్స్ పాటించకపోవడం. ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు అధికారులను ‘మేనేజ్’ చేసి బస్సులు తిప్పుతాయనేది బహిరంగ రహస్యమే. తీరా ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వాలు, అధికారులు ‘మళ్లీ జరగకుండా కఠిన చర్యలు చేపడతాం’ అని ఓ కామన్ డైలాగ్ చెప్పేస్తారు. మరి ఈ మరణాలకు బాధ్యత ఎవరు వహించాలి? బస్సు యాజమాన్యమా? ప్రభుత్వమా? అధికారులా? అన్నీ తెలిసి బస్సెక్కే ప్రయాణికులా? COMMENT


