News October 22, 2025
ఎవరెస్ట్‌ను అధిరోహించిన మొదటి భారతీయురాలు

ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ బచేంద్రీ పాల్. 1985లో ఇండో- నేపాలీ మహిళలతో కలిసి ఎవరెస్ట్ యాత్ర చేపట్టి, 7 ప్రపంచరికార్డులు సృష్టించారు. హరిద్వార్ నుంచి కలకత్తా వరకు 2,500 కి.మీ. మేర గంగా నదిలో యాత్ర సాగించిన రాఫ్టింగ్ బృందానికి నాయకత్వం వహించారు. పద్మశ్రీ, అర్జున అవార్డు, భారత్ గౌరవ్ అవార్డు, 1984లో పద్మభూషణ్, లక్ష్మీబాయి రాష్ట్రీయ సమ్మన్ మొదటి అవార్డు అందుకున్నారు.
Similar News
News October 22, 2025
శ్రీలంక నేతను కాల్చి చంపేశారు

శ్రీలంక దేశం వెలిగామా కౌన్సిల్ ఛైర్మన్, ప్రతిపక్ష సమాగి జన బలవేగయ పార్టీ నేత లసంత విక్రమశేఖర(38) దారుణ హత్యకు గురయ్యారు. తన ఆఫీసులో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న సమయంలో ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి పరారయ్యారు. విక్రమశేఖరను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
News October 22, 2025
రేపు జగన్ మీడియా సమావేశం

AP: YCP చీఫ్ వైఎస్ జగన్ గురువారం ఉదయం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారని పార్టీ ప్రకటన విడుదల చేసింది. సమకాలీన రాజకీయాంశాలపై ఆయన మాట్లాడనున్నారు. పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ గురించి వివరిస్తారని తెలుస్తోంది. అలాగే నకిలీ మద్యం, రాజయ్యపేట బల్క్ డ్రగ్ పార్కు, కాకినాడ సెజ్ భూములు తదితరాలపై వివరాలు వెల్లడిస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
News October 22, 2025
బంగ్లా నేవీ అధీనంలో 8మంది AP మత్స్యకారులు

పొరపాటున తమ జలాల్లోకి ప్రవేశించిన విజయనగరానికి చెందిన 8మంది మత్స్యకారులను బంగ్లా నేవీ అదుపులోకి తీసుకుంది. భోగాపురం మం. కొండ్రాజుపాలెంకి చెందిన మరుపుల్లి చిన్న అప్పన్న, రమేశ్, అప్పలకొండ, ప్రవీణ్, చిన్నఅప్పన్న, రాము, పూసపాటిరేగ మం. తిప్పలవలసకి చెందిన రమణ, రాము విశాఖలోని పోర్ట్ ఏరియాలో ఉంటున్నారు. ఈనెల 13న వేటకు వెళ్లగా.. దారి తప్పి 14న అర్ధరాత్రి 2 గం.కు బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించారు.