News October 22, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్స్ వెల్లువ

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు సమర్పించారు. నిన్న ఒక్కరోజే 117 మంది అభ్యర్థులు 194 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగింది. ఈరోజు స్క్రూటినీ జరగనుండగా, ఎల్లుండి వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది.

Similar News

News October 22, 2025

BIG BREAKING: పోచారంలో కాల్పుల కలకలం

image

హైదరాబాద్ శివారులోని పోచారంలో కాల్పులు కలకలం రేపాయి. బీజేపీ నేతలు తెలిపిన వివరాలు.. బహదూర్‌పురాకు చెందిన ఇబ్రహీం నాగారం మున్సిపాలిటీకి పరిధి రాంపల్లికి చెందిన సోనూ సింగ్‌పై యమ్నంపేట కిట్టి స్టీల్ కంపెనీ వద్ద కాల్పులు జరిపాడు. సోనూ పరిస్థితి విషమించడంతో మేడిపల్లిలోని శ్రీకర హాస్పిటల్‌కు తరలించారు. కాల్పులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 22, 2025

జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్, సునీత నామినేషన్లకు ఆమోదం

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్క్రూటినీ వేళ రిటర్నింగ్ ఆఫీస్ వద్ద కోలాహలం నెలకొంది. అభ్యర్థులు పోటీలో ఉంటారా? లేదా? అనే వెరిఫికేషన్ ఆసక్తిని పెంచింది. అభ్యర్థులు అయితే కాస్త టెన్షన్ పడ్డారు. సునీత నామినేషన్ రద్దు చేయాలని, నవీన్ యాదవ్ నామినేషన్ రద్దు చేయాలని SMలో ఇరు పార్టీల నేతలు పోస్టులు పెట్టారు. కానీ, పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన రిటర్నింగ్ అధికారులు నవీన్ యాదవ్, సునీత నామినేషన్లకు ఆమోదం తెలిపారు.

News October 22, 2025

హైదరాబాద్ కలెక్టర్ పిలుపు

image

తెలంగాణ రైజింగ్-2047 సర్వేలో ప్రజలు, ఉద్యోగులు పాల్గొనాలని కలెక్టర్ హరిచందన పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్ రూపకల్పన కోసం ఉద్దేశించిన సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. 2047 నాటికి దేశ స్వాతంత్ర్యానికి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ ఎలా ఉండాలి? అనే దానిపై ప్రజల నుంచి సలహాలు స్వీకరించేందుకు తెలంగాణ రైజింగ్-2047 సిటిజన్ సర్వే నిర్వహిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.