News October 22, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్స్ వెల్లువ

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు సమర్పించారు. నిన్న ఒక్కరోజే 117 మంది అభ్యర్థులు 194 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగింది. ఈరోజు స్క్రూటినీ జరగనుండగా, ఎల్లుండి వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది.

Similar News

News October 24, 2025

కర్నూల్ ప్రమాదం.. ప్రకాశం ట్రావెల్స్ బస్సులు సేఫేనా?

image

కర్నూల్ వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు <<18087723>>ప్రవేట్ ట్రావెల్స్<<>> బస్సులను ఆశ్రయిస్తారు. ఘటనలు జరిగినప్పుడు ఈ ట్రావెల్స్ బస్సులు ఎంత వరకు సేఫ్ అన్నదానిపై చర్చ నడుస్తోంది. కర్నూల్ వద్ద ప్రమాదానికి గురైన బస్సుకు ఫిట్‌నెస్ గడువు తీరిందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రకాశంలో ట్రావెల్స్ బస్సులు అంతా ఫిట్‌గా ఉన్నాయా.?

News October 24, 2025

‘ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి’

image

జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ శుక్రవారం ఆదేశించారు. రోడ్లు, చెరువులు దెబ్బతిన్న ప్రాంతాల్లో నీటిని తక్షణమే తొలగించాలని సూచించారు. వ్యవసాయ అధికారులు రైతులతో కలిసి పొలాల్లో నిల్వ నీరు తొలగించే చర్యలు చేపట్టాలని తెలియజేశారు. ఈ సమావేశంలో పలువురు జిల్లా అధికారులు ఉన్నారు.

News October 24, 2025

రాజమండ్రిలో ఈ నెల 25న జాబ్ మేళా

image

ఈ నెల 25వ తేదీన రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ జాబ్ మేళాలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులైన 35 ఏళ్ల లోపు అభ్యర్థులకు వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఆమె వివరించారు. అర్హులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.