News October 22, 2025

ములుగు: చెల్లిని ఆస్పత్రికి తీసుకెళ్తూ.. అక్క మృతి

image

ములుగు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో <<18068173>>ఇంటర్ విద్యార్థిని<<>> సింధూజ మృతిచెందిన విషయం తెలిసిందే. కన్నాయిగూడెం మం. చిట్యాల వాసి సింధూజ(17) చెల్లి శ్రీపూజకు తీవ్ర జ్వరం రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లడానికి గ్రామానికి చెందిన యువకుడు కృష్ణారావు సాయం కోరింది. ముగ్గురు కలిసి ఆస్పత్రికి బైక్‌పై వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే సింధూజ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Similar News

News October 22, 2025

శ్రీలంక నేతను కాల్చి చంపేశారు

image

శ్రీలంక దేశం వెలిగామా కౌన్సిల్ ఛైర్మన్, ప్రతిపక్ష సమాగి జన బలవేగయ పార్టీ నేత లసంత విక్రమశేఖర(38) దారుణ హత్యకు గురయ్యారు. తన ఆఫీసులో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న సమయంలో ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి పరారయ్యారు. విక్రమశేఖరను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

News October 22, 2025

బేడ బుడగ జంగం సమస్యలపై మంత్రికి వినతి

image

బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేణు, బుధవారం HYDలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. SC వర్గీకరణ నేపథ్యంలో రిజర్వేషన్ల పరంగా ఏ గ్రూపులో ఉన్న ఉద్యోగాలు, పదోన్నతులు ఇతర గ్రూపులకు తరలించకుండా బ్యాక్ లాగ్ పోస్టులుగా ఉంచాలని ఆయన కోరారు. ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో బేడ బుడగ జంగాలకు తగు న్యాయం చేయాలని మంత్రిని కోరినట్లు వేణు తెలిపారు.

News October 22, 2025

సంగారెడ్డి: పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలి: కలెక్టర్

image

జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో పరిశ్రమల శాఖ అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రూ.24 లక్షల సబ్సిడీ ఆమోదం లభించినట్లు చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.