News October 22, 2025

NZB: రియాజ్ మృతి.. డీజీపీకి SHRC ఆదేశాలు

image

రియాజ్ మృతిపై తెలంగాణ మానవ హక్కుల కమినషన్(SHRC) స్పందించింది. మీడియా కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసింది. నవంబర్ 24వ తేదీలోగా ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికను అందజేయాలని డీజీపీ శివధర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. కాల్పులకు దారి తీసిన పరిస్థితులు, కేసు ఎఫ్ఐఆర్, పోస్టుమార్టం రిపోర్టు అందజేయాలంది. కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కునేందుకు ప్రయత్నించగా కాల్పులు జరిపినట్లు డీజీపీ ప్రకటించారు.

Similar News

News October 22, 2025

సిరిసిల్ల: 108 అంబులెన్స్‌లలో ఆకస్మిక తనిఖీలు

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 108 అత్యవసర అంబులెన్స్ వాహనాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా మేనేజర్ జనార్దన్, సిరిసిల్ల జిల్లా మేనేజర్ అరుణ్ కుమార్ తో కలిసి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు అంబులెన్స్‌లలోని ఆక్సిజన్ నిల్వలు, వెంటిలేటర్, మానిటర్, మందుల ఎక్స్‌పైరీ, వాహనాల కండిషన్తో పాటు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తనిఖీల్లో 108 సిబ్బంది పాల్గొన్నారు.

News October 22, 2025

నెల్లూరు: దంపతుల ఆత్మహత్యాయత్నం.. భర్త మృతి

image

నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడిపల్లిపాడులో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక మురళీధర్, అతని భార్య జలజ పురుగులు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. మురళీధర్ మృతి చెందగా.. జలజను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుత ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉంది. సమాచారం తెలుసుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు ఆరా తీస్తున్నారు.

News October 22, 2025

పెద్దపల్లిలో పి.సి.పి.ఎన్.డి.టి. కమిటీ సమావేశం

image

PDPL(D) వైద్యాధికారి డా. వి. వాణిశ్రీ ఆధ్వర్యంలో పి.సి.పి.ఎన్.డి.టి. కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో 32 స్కానింగ్ కేంద్రాలు ఉండగా, ప్రతినెల 10 కేంద్రాలు తనిఖీ చేస్తామని తెలిపారు. లింగ నిర్ధారణ చేయడం నేరం అని, నేరానికి రూ.10,000 జరిమానా, 3 సంవత్సరాల జైలుశిక్ష ఉంటుందని చెప్పారు. రెన్యువల్ దరఖాస్తులు పరిశీలించి, అప్రూప్రియేట్ కమిటీకి పంపారు. సమావేశంలో డా.రవీందర్, పి.రాకేష్ తదితరులు పాల్గొన్నారు.