News October 22, 2025
GNT: 40 ఏళ్ల పాటు ఓ పత్రికను నడిపారంటే మాటలా.!

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కోలవెన్ను రామకోటేశ్వరరావు ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేటలో 1894 అక్టోబర్ 22న జన్మించారు. న్యాయశాస్త్ర పట్టభద్రులైన ఆయన జాతీయోద్యమం వైపు వెళ్లారు. 1928లో బందరు జాతీయ కళాశాలలో మొదట ఉపాధ్యాయుడిగా, తరువాత ప్రిన్సిపల్‌గా పనిచేశారు. బందరు నుంచి వెలువడిన త్రివేణి అనే సాంస్కృతిక పత్రికను సుమారు 4 దశాబ్దాలు నిర్వహించారు. 1940లో పలు ఉద్యమాలలో పాల్గొని జైలుకు సైతం వెళ్లారు.
Similar News
News October 22, 2025
నెల్లూరు: దంపతుల ఆత్మహత్యాయత్నం.. భర్త మృతి

నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడిపల్లిపాడులో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక మురళీధర్, అతని భార్య జలజ పురుగులు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. మురళీధర్ మృతి చెందగా.. జలజను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుత ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉంది. సమాచారం తెలుసుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు ఆరా తీస్తున్నారు.
News October 22, 2025
పెద్దపల్లిలో పి.సి.పి.ఎన్.డి.టి. కమిటీ సమావేశం

PDPL(D) వైద్యాధికారి డా. వి. వాణిశ్రీ ఆధ్వర్యంలో పి.సి.పి.ఎన్.డి.టి. కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో 32 స్కానింగ్ కేంద్రాలు ఉండగా, ప్రతినెల 10 కేంద్రాలు తనిఖీ చేస్తామని తెలిపారు. లింగ నిర్ధారణ చేయడం నేరం అని, నేరానికి రూ.10,000 జరిమానా, 3 సంవత్సరాల జైలుశిక్ష ఉంటుందని చెప్పారు. రెన్యువల్ దరఖాస్తులు పరిశీలించి, అప్రూప్రియేట్ కమిటీకి పంపారు. సమావేశంలో డా.రవీందర్, పి.రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
News October 22, 2025
ఐఫోన్‌కు బదులు ఐక్యూ మొబైల్.. అమెజాన్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్

AP: అమెజాన్‌పై కర్నూలు జిల్లా కన్జూమర్ ఫోరం నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వీరేశ్ ఇటీవల అమెజాన్‌లో రూ.80వేలతో ఐఫోన్ 15+ ఆర్డర్ చేయగా దానికి బదులు ఐక్యూ ఫోన్ వచ్చింది. కస్టమర్ కేర్‌ను సంప్రదించినా స్పందించకపోవడంతో కన్జూమర్ ఫోరాన్ని సంప్రదించాడు. బాధితుడికి ఐఫోన్ డెలివరీ చేయని పక్షంలో రూ.80వేల రీఫండ్‌తో పాటు మరో రూ.25వేలు చెల్లించాలని ఆదేశించింది. తదుపరి విచారణను NOV 21కి వాయిదా వేసింది.