News October 22, 2025
రూ.10వేల కోట్లతో ‘S-400’ కొనుగోలు

‘ఆపరేషన్ సిందూర్’లో పాకిస్థాన్ మిస్సైళ్లు, డ్రోన్లను విజయవంతంగా నేలకూల్చిన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను భారీగా కొనుగోలు చేయాలని భారత్ యోచిస్తోంది. రష్యా నుంచి రూ.10వేల కోట్ల విలువైన ఈ ఆయుధ వ్యవస్థల కోసం ఇప్పటికే భారత ఎయిర్‌ఫోర్స్ చర్చలు జరిపిందని ANI వెల్లడించింది. 5 S-400ల కోసం 2018లో భారత్ రష్యాతో డీల్ సైన్ చేసింది. మరోవైపు బ్రహ్మోస్ క్షిపణుల బలోపేతానికి భారత్-రష్యా కలిసి పని చేస్తున్నాయి.
Similar News
News October 22, 2025
నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.250 కోట్లు విడుదల

AP: ఎన్టీఆర్ వైద్య సేవ నెట్‌వర్క్ ఆస్పత్రుల బకాయిల్లో రూ.250 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. మరో రూ.250కోట్లు త్వరలోనే రిలీజ్ చేస్తామంది. ఈ క్రమంలో నెట్‌వర్క్ ఆస్పత్రులు వెంటనే సమ్మె విరమించాలని విన్నవించింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ భేటీ అయి నిధుల గురించి చర్చించారు. ఈ సందర్భంగా రూ.250CR విడుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని పయ్యావుల వివరించారు.
News October 22, 2025
సర్ఫరాజ్ ఇంకా ఏం నిరూపించుకోవాలి: అశ్విన్

సర్ఫరాజ్ ఖాన్‌ను ఇండియా-ఏ జట్టుకు ఎంపిక చేయకపోవడంపై మాజీ ప్లేయర్ అశ్విన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘అతడు ఇంకా ఏం నిరూపించుకోవాలి? బరువు తగ్గాడు. భారీగా పరుగులు చేశాడు. గతేడాది న్యూజిలాండ్‌తో టెస్టులో సెంచరీ కూడా బాదాడు. కానీ అప్పటి నుంచి సీనియర్ టీమ్‌లో కాదు కదా A జట్టులో కూడా చోటు దక్కకపోతే ఎలా? ఇక అతడి అవసరం లేదేమో.. సర్ఫరాజ్‌కు డోర్లు దాదాపు మూసుకుపోయినట్లే’ అని వ్యాఖ్యానించారు.
News October 22, 2025
AP న్యూస్ రౌండప్

✒ పలు జిల్లాలకు ఆకస్మిక వరదలొచ్చే ఆస్కారం.. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని Dy.CM పవన్ ఆదేశాలు
✒ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం.. ఈ నెల 23న తమ పార్టీ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో సంతకాలు సేకరణ: YCP
✒ ప్రభుత్వ కార్యక్రమాలపై 75.1% ప్రజలు సంతృప్తి: మంత్రి పార్థసారథి
✒ అబద్ధానికి అధికారం ఇస్తే.. అది కూటమి ప్రభుత్వం: చెల్లుబోయిన వేణు