News October 22, 2025

పల్నాడు: ఖరీఫ్ అనుభవాలతో రబీ పంటకు ప్రణాళికలు

image

ఖరీఫ్ పంటలో చోటు చేసుకున్న అనుభవాలతో రబీ పంటకు ఇబ్బందు లేకుండా పల్నాడు జిల్లాలో వ్యవసాయ శాఖ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. పల్నాడు జిల్లాలో పంటల విస్తీర్ణాన్ని గుర్తించి ఏ పంటను ఎంత విస్తీర్ణంలో వేస్తారో అంచనా వేస్తుంది. ఖరీఫ్‌లో జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో యూరియా కొరత నెలకొన్న నేపథ్యంలో రబీ పంటకు ఎరువుల కొరత లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

Similar News

News October 24, 2025

రోడ్డు భద్రత కోసం పటిష్ఠమైన చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

జిల్లాలో రోడ్డు భద్రత కోసం పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లో జిల్లా రోడ్డు భద్రతా సమావేశాన్ని ఎస్పీ జగదీశ్‌తో కలిసి నిర్వహించారు. రోడ్డు భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. గుత్తి -గుంతకల్లు రోడ్లోని రోడ్ & ఆర్ఓబీని, రాప్తాడు వద్ద రైల్వేలైన్ ఉన్న బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలన్నారు.

News October 24, 2025

సీటింగ్ పర్మిషన్ తీసుకొని!

image

కర్నూలులో ప్రమాదానికి గురైన బస్సు యజమానులు ప్రయాణికుల ప్రాణాల కంటే డబ్బుకే ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది. 43 సీట్ల సీటింగ్‌కు పర్మిషన్ తీసుకొని దాన్ని స్లీపర్‌గా మార్చడమే దీనికి నిదర్శనం. ఈ బస్సుకు డయ్యూ‌డామన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆల్‌ ఇండియా పర్మిట్ తీసుకున్నారు. ఒడిశాలో ఆల్ట్రేషన్‌, ఫిట్‌నెస్‌ చేయించారు. 2018లో TGలో, 2023లో NOCతో డయ్యూ డామన్‌లో మరోసారి రిజిస్ట్రేషన్‌ జరిగింది.

News October 24, 2025

లో దుస్తుల్ని ఎలా ఎంచుకోవాలంటే?

image

మనం నిత్యం ధరించే లోదుస్తుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. మరీ బిగుతుగా కాకుండా సరైన సైజ్‌ లోదుస్తులే వాడాలి. సింథటిక్, నాన్‌ బ్రీతబుల్‌ మెటీరియల్ వాడకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. ఇవి చెమటలను పీల్చుకోకపోగా బ్యాక్టీరియా వృద్ధికి కారణమవుతాయంటున్నారు. అలాగే మరీ లూజ్‌గా ఉన్నవి వేసుకున్నా అసౌకర్యంగా ఉండటంతో పాటు మెడ, భుజాల నొప్పికి కూడా దారితీస్తాయంటున్నారు.