News October 22, 2025
నాగర్‌కర్నూల్: ఊర్కొండలో అత్యధిక వర్షపాతం

నాగర్‌కర్నూల్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాత వివరాలను వాతావరణ శాఖ బుధవారం ప్రకటించింది. జిల్లాలోనే అత్యధికంగా ఊర్కొండలో 37.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. చారకొండలో 31.8 మి.మీ., పదరలో 22.2 మి.మీ. చొప్పున వర్షం కురిసింది. మిగతా ప్రాంతాలలో కూడా ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది.
Similar News
News October 24, 2025
ఆస్ట్రేలియా టీ20 జట్టులో భారీ మార్పులు

భారత్‌తో ఈనెల 29 నుంచి NOV 8 వరకు జరగనున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టులో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. గాయం నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ ఆఖరి 3 మ్యాచ్‌లు ఆడనున్నారు. ENGతో యాషెస్ సిరీస్ నేపథ్యంలో హేజిల్‌వుడ్ 2, సీన్ అబాట్ 3 మ్యాచ్‌లకు మాత్రమే ఎంపికయ్యారు. వీరి స్థానాల్ని బియర్డ్‌మ్యాన్, డ్వార్‌షూస్ భర్తీ చేయనున్నారు. కీపర్ జోష్ ఫిలిప్ అన్ని మ్యాచ్‌లూ ఆడనున్నారు.
News October 24, 2025
కరెంట్ షాక్‌కు గురై వ్యక్తి మృతి

ఏలూరు రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని గన్నవరం రైల్వే స్టేషన్‌లో కరెంట్ షాక్‌కు గురైన గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం మృతి చెందాడు. ఈనెల 19న గన్నవరం రైల్వే స్టేషన్లో అతను కాక్‌కు గురయ్యాడు. రైల్వే సిబ్బంది అతన్ని విజయవాడ తరలించారు. సమాచారం తెలిసినవారు ఏలూరు రైల్వే పోలీసులను సంప్రదించాలని రైల్వే ఎస్ఐ ఎస్సై శివన్నారాయణ సూచించారు.
News October 24, 2025
రబీలో జొన్న సాగు – అనువైన రకాలు

రబీ(యాసంగి)లో తేలికపాటి నీటి తడులకు అవకాశం ఉండే ప్రాంతాల్లో వరికి ప్రత్యామ్నాయంగా జొన్న పంటను రైతులు సాగు చేస్తున్నారు. తేమను నిలుపుకునే లోతైన నల్లరేగడి నేలలు, నీటి వసతి ఉండే ఎర్ర చల్కా నేలల్లో జొన్నను సాగు చేయవచ్చు. ఎకరాకు 3-4 కిలోల విత్తనం అవసరం. తాండూరు జొన్న-55, తాండూరు జొన్న-1, సి.యస్.వి 29 ఆర్, ఎన్.టి.జె-5, సి.యస్.హెచ్ 39 ఆర్, సి.యస్.హెచ్ 15 ఆర్ వంటి జొన్న రకాలు రబీ సాగుకు అనుకూలం.


