News October 22, 2025

ములుగు: మహా జాతరకు ఇంకా 98 రోజులే !

image

మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు ఇంకా 98 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. జాతర సమయం దగ్గర పడుతుండగా పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు ఇంకా ప్రారంభం కాలేదు. గద్దెల విస్తరణ పనులు తప్ప ఇతర పనులు ఇంకా మొదలు కాకపోవడంతో సర్వత్ర ఆందోళన నెలకొంది. జాతర సమయానికి పనులు పూర్తవుతాయా ?, ప్రతి జాతరలా హడావిడి పనులు చేసి చేతులు దులుపుకుంటారా ? అని భక్తులు అనుమానవం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News October 22, 2025

స్త్రీ శక్తి పథకం మరింత ముందుకు తీసుకువెళ్లాలి: DPTO

image

‘స్త్రీ శక్తి’ పథకం మరింత ముందుకు సాగేందుకు ఆర్టీసీ సిబ్బంది, అద్దె బస్సుల యజమానులు సహకరించాలని డీపీటీఓ వైఎస్‌ఎన్‌ మూర్తి కోరారు. బుధవారం రాజమండ్రి కార్యాలయంలో డిపో మేనేజర్లు, అద్దె బస్సుల యజమానులతో ఆయన సమావేశం నిర్వహించారు. పథకం విజయానికి ఆర్టీసీ బస్సులతో పాటు అద్దె బస్సుల పాత్ర కూడా ముఖ్యమన్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా నిర్ణీత సమయంలో గమ్యానికి చేర్చాలని సూచించారు.

News October 22, 2025

సౌత్ ఆఫ్రికా సిరీస్‌లో హార్దిక్ పాండ్య!

image

ఆసియా కప్ సమయంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయంతో హార్దిక్ పాండ్య టీమ్‌కు దూరమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్‌కు కూడా అతను విశ్రాంతిలోనే ఉన్నారు. అయితే హార్దిక్ కోలుకున్నారని, సౌత్ ఆఫ్రికాతో జరగబోయే సిరీస్‌కి అందుబాటులో ఉంటారని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. SA జట్టు నవంబర్ 14 నుంచి డిసెంబర్ 19 వరకు 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20ల కోసం భారత్‌లో పర్యటించనుంది.

News October 22, 2025

పెద్దపల్లిలో ‘లింగ నిర్ధారణ’ చట్ట వ్యతిరేకం: డీఎంహెచ్ఓ వాణీ శ్రీ

image

పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో బుధవారం పీసీపీఎన్డీటీ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ వాణీ శ్రీ మాట్లాడుతూ.. జిల్లాలో 32 స్కానింగ్ సెంటర్లు రిజిస్టర్ అయ్యాయని, వాటిలో ప్రతి నెలా 10 సెంటర్లను తనిఖీ చేస్తూ తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చట్ట విరుద్ధమని, నేరమని ఆమె స్పష్టం చేశారు.