News October 22, 2025

కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు

image

కామారెడ్డి జిల్లాలో రాత్రిపూట చలి ప్రభావం పెరిగింది. పల్వంచ మండలంలో 34.3 సెంటిగ్రేడ్, బాన్సవాడలో 33.7, గాంధారి, మద్నూర్ 33.5, బిచ్కుంద 33,1, దోమకొండలో 32.9 ఉష్ణోగ్రతలు నమోదు అయ్యియి. అత్యల్పంగా తాడ్వాయి, సదాశివనగర్ మండలాల్లో 31.4 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయింది. చలి తీవ్రత పెరుగుతున్నందున వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.

Similar News

News October 22, 2025

బాధితుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలి: కలెక్టర్

image

కలెక్టర్ సిక్తా పట్నాయక్‌ ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు నష్టపరిహారం వేగంగా అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సూచనలను షెడ్యూల్ కులాలు, తెగల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆమె తెలిపారు. సీఎం SP వినీత్‌తో కలిసి ఈ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్, బాధితుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించడానికి అధికారులను కట్టుబడి పనిచేయాలన్నారు.

News October 22, 2025

విశాఖ రైతు బజార్లలో డ్రా ద్వారా 129 మందికి స్టాల్స్ మంజూరు

image

విశాఖలోని రైతు బజార్లలో స్టాల్స్ కేటాయింపుల కోసం డ్రా నిర్వహించారు. దరఖాస్తు చేసిన వారిలో 129 మంది రైతులకు రైతు కార్డులు మంజూరు చేసినట్లు జేసీ మయూర్ అశోక్ తెలిపారు. డ్రా ప్రక్రియను కలెక్టరేట్‌లో అధికారులు, రైతుల సమక్షంలో నిర్వహించారు. ఎంపికైన వారికి త్వరలో రైతు బజార్లలో స్టాల్స్ కేటాయించనున్నారు.

News October 22, 2025

గోదావరిఖని వన్‌టౌన్‌లో మెగా రక్తదాన శిబిరం

image

పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా గోదావరిఖని 1 టౌన్‌ సీఐ ఇంద్రసేనా రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో మెగా రక్తదాన శిబిరాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీపీ అంబర్‌ కిషోర్‌ హాజరై డీసీపీ పీ.కరుణాకర్‌, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్‌తో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు పోలీసులు, యువత రక్తదానం చేశారు. ఈ రక్తాన్ని తల సేమియా వ్యాధిగ్రస్తులకు అందించనున్నట్లు తెలిపారు.