News October 22, 2025
సీతంపేటలో నేతకాని బతుకమ్మ ప్రారంభం

HNK జిల్లా సీతంపేటలో నేతకాని కులస్థుల దీపావళి బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. వారం రోజులుగా వివిధ రాష్ట్రాల నుంచి కుటుంబ సభ్యులు చేరడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఫస్ట్ రోజు ఉపవాస దీక్షతో రేగడి మట్టిని సేకరించి జోడెద్దుల విగ్రహ ప్రతిమలు తయారు చేస్తారు. పిండి వంటలతో నగలతో అలంకరించి కేదారీశ్వరస్వామి వ్రతం నిర్వహిస్తారు. రెండో రోజు విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు.
Similar News
News October 24, 2025
జిల్లాను అగ్రపథంలో నిలుపుదాం: మంత్రి ఆనం

జిల్లాను అన్నీ రంగాల్లో ముందు నిలపాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కలెక్టర్ హిమాన్షు శుక్లాకు సూచించారు. ఈ మేరకు కలెక్టర్ మంత్రిని కలిసి అభివృద్ధి, సంక్షేమ అమలు తీరుపై, వర్షాలకు చేపట్టిన ముందస్తు చర్యలను వివరించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులను సమన్వయం చేసుకుంటూ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి కోరారు.
News October 24, 2025
పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలలకు సెలవు మంజూరు చేయాలి: కలెక్టర్

జిల్లా పరిధిలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు కారణంగా పరిస్థితులను బట్టి విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను కలెక్టర్ ఆర్ మహేశ్ కుమార్ శుక్రవారం ఆదేశించారు. అవసరమైతే స్థానిక తహశీల్దారుతో చర్చించి సెలవులు ప్రకటించాలని కలెక్టర్ సూచించారు. అలాగే శిథిలావస్థలో ఉన్న పాఠశాలలలో విద్యార్థులను ఉంచరాదని ఆదేశించారు.
News October 24, 2025
స్వర్ణాంధ్ర లక్ష్యసాధన దిశగా అడుగులు: దినకర్

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘వికసిత్ భారత్’లో భాగంగా 2047 కల్లా స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు చేపట్టాల్సిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ మంత్రి ఆనంతో చర్చించారు. ఈ మేరకు దినకర్ మంత్రిని ఆయన నివాసంలో కలిశారు. ఆహార భద్రత, పూర్తి కావాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టులు, జిల్లాల అభివృద్ధి సూచికలు, పీఎం ధన ధాన్య కృషి యోజన అంశాలపై వారు చర్చించారు.


