News April 9, 2024
మంగళగిరి సీపీఎం అభ్యర్థిగా జొన్నా శివశంకర్

ఇండియా కూటమిలో భాగంగా సీపీఎం రాష్ట్రంలోని 10 ఎమ్మెల్యే, ఒక లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఈ క్రమంలో మంగళగిరి సీపీఎం అభ్యర్థిగా జొన్నా శివశంకర్‌కు టికెట్ కేటాయించింది. కాంగ్రెస్ పార్టీలో చర్చల అనంతరం సీపీఎం సోమవారం అభ్యర్థులను ఫైనల్ చేసింది. మరోవైపు, మంగళగిరి నుంచి వైసీపీ బరిలో మురుగుడు లావణ్య, కూటమి అభ్యర్థిగా నారా లోకేశ్ బరిలో దిగుతున్న విషయం తెలిసిందే.
Similar News
News October 26, 2025
GNT: వరుస సెలవులు.. హాస్టల్స్ ఖాళీ చేసి వెళుతున్న విద్యార్ధులు

తుఫాన్ కారణంగా జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడంతో హాస్టల్ విద్యార్ధులు ఇళ్ల బాట పట్టారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి తెనాలిలోని పలు హాస్టల్స్‌లో ఉంటూ చదువుకుంటున్న స్కూల్స్ , కాలేజీల విద్యార్ధులు వర్షాలకు ముందు జాగ్రత్తగా ఆదివారమే ఖాళీ చేసి తమ తమ స్వస్థలాలకు బయలుదేరారు. కొన్ని ప్రభుత్వ గిరిజన సంక్షేమ హాస్టల్స్ మాత్రం విద్యార్ధులను అక్కడే ఉంచి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
News October 26, 2025
గుంటూరు GMCలో మొంథా తుఫాన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

‘మొంథా’ తుఫాన్ నేపథ్యంలో గుంటూరు నగరంలో తలెత్తే సమస్యలపై ఫిర్యాదుల కోసం జీఎంసీ కార్యాలయంలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. కంట్రోల్ రూమ్ నంబర్ 0863-2345103, వాట్సాప్ నంబర్ 9849908391ను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఈ నంబర్‌లకు ఫోన్ చేసి సహాయం పొందాలని కోరారు.
News October 26, 2025
GNT: రైతుల గుండెల్లో తుఫాన్ గుబులు..!

తుపాను హెచ్చరికలతో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే అధిక వర్షాలతో డెల్టాలోని రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు తుపాను ప్రభావంతో ఈదురు గాలులు, అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో అన్నదాతల గుండెల్లో గుబులు మొదలైంది. గుంటూరు జిల్లాలో ప్రస్తుతం వరి పైరు ఏపుగా పెరుగుతోంది. ఈ సమయంలో తుఫాను వస్తే పంట నీట మునిగి ఎందుకూ పనికి రాదని రైతులు భయపడుతున్నారు.


