News October 22, 2025

సిద్దిపేట: మద్యం మత్తులో తండ్రిని చంపాడు

image

మద్యం మత్తులో కుమారుడు తండ్రిని హత్య చేసిన ఘటన మేడ్చల్‌ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. సిద్దిపేట జిల్లా ములుగు మండలం అచయిపల్లికి చెందిన నిజాముద్దీన్‌ను తన కొడుకు సాతక్ హత్య చేశాడు. మద్యం మత్తులో వారిద్దరి మధ్య గొడవ జరగ్గా సాతక్ తుర్కపల్లి వాటర్ ప్లాంట్ వద్ద బండరాయితో కొట్టి నిజాముద్దీన్‌ను చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి సాతక్‌తో పాటు అతడి స్నేహితుడు రాజును అరెస్టు చేశారు.

Similar News

News October 23, 2025

ఖమ్మం: బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో సీట్ల భర్తీ

image

జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో డ్రాపౌట్‌ల ద్వారా ఏర్పడిన 40 సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ అభివృద్ధి అధికారి శ్రీలత తెలిపారు. 3, 4, 6, 7, 8, 9వ తరగతుల్లో రెసిడెన్షియల్, నాన్-రెసిడెన్షియల్ విభాగాల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తిగల విద్యార్థులు నవంబరు 2వ తేదీలోపు కలెక్టరేట్‌లోని ఎస్-27 విభాగంలో సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.

News October 23, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 23, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.58 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.11 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.12 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.49 గంటలకు
✒ ఇష: రాత్రి 7.02 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 23, 2025

VZM: జిల్లాకు బాక్సింగ్‌లో 4 రాష్ట్ర స్థాయి మెడల్స్

image

రాజమండ్రిలో జరిగిన స్కూల్ గేమ్స్‌లో విజయనగరం జిల్లా బాక్సింగ్ క్రీడాకారులు సత్తా చాటారు. అండర్-17 కేటగిరీలో దుర్గాప్రసాద్, సచిన్.. అండర్-19 కేటగిరీలో వర్ధన్ రెడ్డి, యశ్వంత్ బంగారు పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో క్రీడాకారులు కలెక్టర్ రాం సుందర్ రెడ్డిని బుధవారం కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటాలని కలెక్టర్ సూచించారు.