News October 22, 2025

GNT: మంచు మొదలైంది బాసు.. జాగ్రత్తగా నడుపు.!

image

కార్తీక మాసం ప్రారంభం కావడంతో ఉదయం చలితోపాటు మంచు మొదలైంది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా రోడ్ల పక్కన ఎక్కువ శాతం వ్యవసాయ భూములు ఉండటంతో, ప్రయాణం చేసే వారికి జాగ్రత్త అవసరం. మంచు పెరగడంతో దారులు కనబడటం కష్టతరం కావచ్చు. వాహనదారులు వేగం తగ్గించి, ఫాగ్ లైట్లు ఉపయోగిస్తూ, రోడ్ల పరిస్థితిని గమనిస్తూ ప్రయాణించాలి. జాగ్రత్త మీ వేగం మీ కుటుంబానికే కాదు.. మరో కుటుంబానికి కూడా దుఃఖాన్ని మిగులుస్తుంది.

Similar News

News October 24, 2025

నవీపేట్ శివారులో మహిళ మృతదేహం

image

నిజామాబాద్ జిల్లా నవీపేట్ నుంచి నాగేపూర్ వెళ్లే రహదారి మధ్యలో హనుమాన్ టెంపుల్ పక్క గల శివారులో గుర్తుతెలియని మహిళా మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. నవీపేట్ ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిపల్లి గ్రామానికి చెందిన మహిళగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఘటన యొక్క పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

News October 24, 2025

కర్నూలు బస్సు ప్రమాదంలో ఇంకొల్లు యువతి మృతి

image

కర్నూలు జిల్లాలో శుక్రవారం జరిగిన బస్సు ప్రమాదంలో ఇంకొల్లులోని పూసపాడుకు చెందిన గన్నమనేని ధాత్రి (27) మృతి చెందింది. ఈ ఘటనపై పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ధాత్రి కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పరామర్శిస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. యువతి మరణ వార్త గ్రామంలో విషాద ఛాయలు నింపింది.

News October 24, 2025

ఈ రోజు రాత్రి ఢిల్లీకి CM రేవంత్ రెడ్డి

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుల ఎంపికపై చర్చించనున్నారు. దానికోసం ఈ రోజు రాత్రి దేశ రాజధానికి బయల్దేరనున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు రాష్ట్ర ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. సీఎం 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.