News October 22, 2025
‘కార్తీక మాసం’ అనే పేరెందుకు?

నక్షత్ర గమనం ఆధారంగా ఈ మాసానికి కార్తీక మాసం అనే దివ్య నామం సిద్ధించింది. శరదృతువులో వచ్చే ఈ పుణ్య మాసంలో పౌర్ణమి రోజున చంద్రుడు ఆకాశంలో కృత్తికా నక్షత్రం వద్ద సంచరిస్తాడు. అందువల్లే ఈ మాసానికి ‘కార్తీక’ అని పేరు వచ్చింది. తెలుగు మాసాలలో ఈ మాసం అతి పవిత్రమైనది. ‘న కార్తీక నమో మాసః’ అంటే కార్తీకానికి సమానమైన మాసం లేదని పురాణాలు కీర్తిస్తున్నాయి. శివకేశవుల అనుగ్రహం పొందడానికి ఈ మాసం ఉత్తమమైనది.
Similar News
News October 25, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 25, 2025
శుభ సమయం (25-10-2025) శనివారం

✒ తిథి: శుక్ల చవితి రా.12.01 వరకు
✒ నక్షత్రం: జ్యేష్ట పూర్తిగా
✒ శుభ సమయాలు: ఏమీ లేవు
✒ రాహుకాలం: ఉ.9.00-10.30 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.6.00-7.36 వరకు
✒ వర్జ్యం: మ.12.04-1.50 వరకు
✒ అమృత ఘడియలు: రా.10.09-11.53 వరకు
✍️ రోజువారీ పంచాంగం, <<-se_10009>>రాశి ఫలాలు<<>> కోసం క్లిక్ చేయండి.
News October 25, 2025
HEADLINES

* కర్నూలులో ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది మృతి
* ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, రేవంత్ దిగ్భ్రాంతి
* మావోయిజం, నక్సలిజం లేకుండా చేస్తాం: మోదీ
* దేశంలో క్వాంటం వ్యాలీ ఉండే ఏకైక ప్రాంతం AP: CBN
* బంగాళాఖాతంలో ఈనెల 27న ఏర్పడనున్న తుఫాన్.. అత్యంత భారీ వర్షాలకు అవకాశం
* భారీగా తగ్గిన వెండి ధరలు


