News October 22, 2025

జూబ్లీహిల్స్‌ బైపోల్: ఓపిక లేదని వెళ్లిపోయారు!

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్‌ ప్రక్రియలో అభ్యర్థులకే చిరాకు వచ్చింది. నిన్న పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో అధికారులు టోకెన్లు ఇచ్చారు. బుధవారం తెల్లవారుజాము వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగడంతో టోకెన్లు తీసుకున్న కొందరు అర్ధరాత్రి దాటినా ఇంకా సమయం పడుతుందని తెలిసి, ఇక తమ వల్ల కాదంటూ వెనక్కి వెళ్లిపోయారు. 10 మందికిపైగా అభ్యర్థులు టోకెన్లు తీసుకొని నామినేషన్ వేయనట్లు అధికారులు గుర్తించారు.

Similar News

News October 22, 2025

జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్, సునీత నామినేషన్లకు ఆమోదం

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్క్రూటినీ వేళ రిటర్నింగ్ ఆఫీస్ వద్ద కోలాహలం నెలకొంది. అభ్యర్థులు పోటీలో ఉంటారా? లేదా? అనే వెరిఫికేషన్ ఆసక్తిని పెంచింది. అభ్యర్థులు అయితే కాస్త టెన్షన్ పడ్డారు. సునీత నామినేషన్ రద్దు చేయాలని, నవీన్ యాదవ్ నామినేషన్ రద్దు చేయాలని SMలో ఇరు పార్టీల నేతలు పోస్టులు పెట్టారు. కానీ, పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన రిటర్నింగ్ అధికారులు నవీన్ యాదవ్, సునీత నామినేషన్లకు ఆమోదం తెలిపారు.

News October 22, 2025

హైదరాబాద్ కలెక్టర్ పిలుపు

image

తెలంగాణ రైజింగ్-2047 సర్వేలో ప్రజలు, ఉద్యోగులు పాల్గొనాలని కలెక్టర్ హరిచందన పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్ రూపకల్పన కోసం ఉద్దేశించిన సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. 2047 నాటికి దేశ స్వాతంత్ర్యానికి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ ఎలా ఉండాలి? అనే దానిపై ప్రజల నుంచి సలహాలు స్వీకరించేందుకు తెలంగాణ రైజింగ్-2047 సిటిజన్ సర్వే నిర్వహిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

News October 22, 2025

యాదవుల ఖదర్.. హైదరాబాద్ సదర్

image

సదర్.. సిటీలో జరిగే యూనిక్ ఫెస్టివల్. తమిళనాడు జల్లికట్టు వలే సదర్‌ ఫేమస్. నిజాం నుంచే ఇది మొదలైంది. నాడు పెద్దలను ఉర్దూలో సదర్‌ అనేవారు. ఇలా పెద్దల సమ్మేళనం ‘సదర్ సమ్మేళన్‌’గా మారింది. పాడి రైతులు, యాదవులు ఇష్టంగా పెంచుకున్న పశువులకు పూజలు చేయడం ఆనవాయితీగా వచ్చింది. పెద్ద సదర్‌లో ప్రదర్శించే దున్నరాజులు అత్యంత బలమైనవి. వాటితోనే HYD యువత విన్యాసాలు చేయడం సదర్‌కు మరింత ప్రఖ్యాతిని తెచ్చి పెట్టాయి.