News October 22, 2025
తిరుపతి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సూచనలు

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. మత్స్యకారులు ఎవ్వరూ చేపల వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వాగులు పొంగే చోట అధికారులు హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశించారు.
Similar News
News October 22, 2025
కుమార్తె పై అత్యాచారయత్నం.. ఐదేళ్ల జైలు: SP

బొబ్బిలిలోని ఓ కోలనీలో 11 ఏళ్ల కుమార్తెపై అత్యాచారయత్నానికి పాల్పడిన నరసింగరావు (42)కి ఐదేళ్ల ఏళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానాను పోక్సో కోర్టు విధించిందని ఎస్పీ దామోదర్ తెలిపారు. బాధితురాలికి రూ.50 వేల పరిహారం మంజూరు చేసిందన్నారు. జూలైలో నమోదైన కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసిన సీఐ సతీష్ కుమార్, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
News October 22, 2025
జనగామలో వెలిగిన ఆకాశ జ్యోతి..!

కార్తీకమాసాన్ని పురస్కరించుకొని జనగామ జిల్లా కేంద్రంలోని గుండ్లగడ్డ శ్రీఉమామహేశ్వర దేవాలయంలో కార్తీకమాసం మొదటి రోజు సందర్భంగా బుధవారం రాత్రి ఆకాశ జ్యోతిని వెలిగించారు. ఆలయ పూజారి సాంబమూర్తి కార్తీక మాస పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు అనురాధ, రాణి, హైమ, రమ, ఉమా, మౌనిక, విజయ, ప్రభాకర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
News October 22, 2025
పట్టణాలు, నగరాల్లో ఇక కామన్ జోనింగ్ విధానం

AP: రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో జోనింగ్ నిబంధనలు ఒకేమాదిరి కాకుండా వేర్వేరుగా ఉన్నాయి. దీనివల్ల లైసెన్సులు, నిర్మాణ అనుమతులు ఇతర అంశాలలో సమస్యలు ఎదురవుతున్నాయి. దీని నివారణకు ప్రభుత్వం కామన్ జోనింగ్ విధానాన్ని ప్రవేశపెడుతూ తాజాగా <