News October 22, 2025
ALP: రేపు అలంపూరు ఆలయాల హుండీ లెక్కింపు

అలంపూర్‌లో వెలసిన జోగులాంబ దేవి, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల హుండీ లెక్కింపు రేపు (గురువారం) నిర్వహిస్తున్నట్లు ఈవో దీప్తి బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఆలయాల ప్రాంగణంలో ఉదయం 10:00 గంటల నుంచి లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. స్వామి అమ్మవారి భక్తులు, పరిసర ప్రాంత భక్తులు హాజరై హుండీ లెక్కింపులో పాల్గొని స్వామి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
Similar News
News October 24, 2025
‘గూగుల్ తల్లి’ గుండెల్లో Ai గుబులు

గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌కు ఇకపై టెస్టింగ్ టైమ్. చాట్ GPT ఈమధ్యే అట్లాస్ Ai బ్రౌజర్ లాంఛ్ చేయగా మైక్రోసాఫ్ట్ తన కోపైలట్ సాఫ్ట్‌వేర్‌ను ఎడ్జ్ బ్రౌజర్‌లో ఇంటిగ్రేట్ చేస్తోంది. కాగా ఇప్పటికే జెమిని Aiని బ్రౌజర్‌లో గూగుల్ చేర్చి సెర్చ్ రిజల్ట్స్ చూపిస్తోంది. కానీ యూజర్లు ఇక్కడే కంటెంట్ పొంది సైట్లకు వెళ్లక యాడ్ రెవెన్యూపై ప్రభావం పడుతోందట. అటు పోటీ ఇటు ఆర్థిక పోట్లతో గూగుల్‌కు డెంట్ తప్పదు అన్పిస్తోంది.
News October 24, 2025
కథలాపూర్: ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించిన కలెక్టర్

కథలాపూర్ మండలం దుంపేట గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు. మంజూరైన ఇండ్లను నాణ్యతతో, సకాలంలో పూర్తి చేయాలని, పనులు పూర్తి అయిన వెంటనే బిల్లులు అందుకోవాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు అవసరమైతే మహిళా సంఘాల ద్వారా రుణాలు అందించాలన్నారు. ప్రభుత్వం ఇసుక ఉచితంగా అందిస్తుందని, రవాణా, కూలీ ఖర్చులు లబ్ధిదారులే చెల్లించాలని సూచించారు.
News October 24, 2025
పాక్‌కు షాక్.. నీళ్లు వెళ్లకుండా అఫ్గాన్‌లో డ్యామ్!

పాక్‌కు నీళ్లు వెళ్లకుండా నియంత్రించాలని అఫ్గాన్ ప్లాన్ చేస్తోంది. కునార్ నదిపై వీలైనంత త్వరగా డ్యామ్ నిర్మించాలని తాలిబన్ సుప్రీంలీడర్ మౌలావీ హైబతుల్లా అఖుంద్‌జాదా ఆదేశాలిచ్చారు. విదేశీ కంపెనీల కోసం చూడకుండా దేశీయ కంపెనీలతోనే ఒప్పందం చేసుకోవాలని సూచించారు. 2 దేశాల మధ్య సరిహద్దు ఘర్షణల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత <<16207281>>సింధూ జలాల<<>> ఒప్పందాన్ని భారత్ నిలిపేయడం తెలిసిందే.


