News October 22, 2025

మల్లన్న దర్శనానికి 3 గంటల సమయం

image

కార్తీక మాసం తొలిరోజు శ్రీశైలం మల్లన్న ఆలయం భక్తజనంతో కిటకిటలాడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఉచిత దర్శనం క్యూలైన్లలో దర్శనానికి వెళ్లేందుకు సుమారు 3 గంటలకుపైగా సమయం పడుతున్నట్లు భక్తులు తెలిపారు. ఆలయ ప్రాంగణాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. అయ్యప్ప దీక్ష దారులు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు.

Similar News

News October 22, 2025

BIG BREAKING: పోచారంలో కాల్పుల కలకలం

image

హైదరాబాద్ శివారులోని పోచారంలో కాల్పులు కలకలం రేపాయి. బీజేపీ నేతలు తెలిపిన వివరాలు.. బహదూర్‌పురాకు చెందిన ఇబ్రహీం నాగారం మున్సిపాలిటీకి పరిధి రాంపల్లికి చెందిన సోనూ సింగ్‌పై యమ్నంపేట కిట్టి స్టీల్ కంపెనీ వద్ద కాల్పులు జరిపాడు. సోనూ పరిస్థితి విషమించడంతో మేడిపల్లిలోని శ్రీకర హాస్పిటల్‌కు తరలించారు. కాల్పులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 22, 2025

జగిత్యాల జిల్లా స్థాయి క్రీడా పోటీల ప్రారంభం

image

మినిస్ట్రీ ఆఫ్ యూత్ ఎఫైర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జగిత్యాల వివేకానంద స్టేడియంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలను డీఆర్డీఏ పీడీ రఘువరన్ బుధవారం ప్రారంభించారు. 20 వాలీబాల్ జట్లు, కబడ్డీలో 14 జట్లు, మహిళా విభాగం కబడ్డీలో 8 జట్లు, వాలీబాల్ లో 6 జట్లు పాల్గొన్నాయి. కబడ్డీ విభాగంలో బీర్పూర్, నక్కలపేట జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. డీవైఎస్ఓ రవికుమార్, డీవైఓ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

News October 22, 2025

KNR: పోలీసులకు వ్యాసరచన పోటీలు

image

KNR కమిషనరేట్ కేంద్రంలో జరుగుతున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బందికి రెండు కేటగిరీలలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో పోలీస్ కానిస్టేబుల్ నుండి ఏఎస్సై వరకు గల సిబ్బందికి “పని ప్రదేశంలో లింగ వివక్ష” అనే అంశంపై, ఎస్సై, ఆపై స్థాయి అధికారులకు “క్షేత్ర స్థాయిలో పోలీసింగ్ బలోపేతం చేయడం” అనే అంశంపై పోటీలు నిర్వహించారు. మొత్తం 117మంది పోలీసులు పాల్గొన్నారు.