News October 22, 2025

కొత్తకోట: రెండు వాహనాలు ఢీ.. 8 మందికి గాయాలు

image

కొత్తకోట మండలం నాటవెల్లి-ముమ్మాలపల్లి గ్రామాల మధ్య NH- 44 పై బొలెరో, తుఫాన్ ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాదు నుంచి పెబ్బేరు వైపు ప్రయాణికులతో వెళుతున్న తుఫాన్, కర్నూల్ నుంచి హైదరాబాద్ వెళుతున్న బొలెరోను ఢీకొంది. క్షతగాత్రుల్ని వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Similar News

News October 24, 2025

రౌడీ షీటర్లకు ఎస్పీ కౌన్సెలింగ్‌

image

ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవ‌ని నల్గొండ జిల్లా ఎస్పీ శ‌ర‌త్ చంద్ర ప‌వార్ హెచ్చరించారు. శుక్ర‌వారం జిల్లాలోని రౌడీ షీటర్స్‌‌కు కౌన్సెలింగ్ నిర్వ‌హించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్‌తో సహా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సత్ప్రవర్తనతో మెలగేవారికి పోలీసుల సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.

News October 24, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

* కర్నూల్ బస్సు ప్రమాదంపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దిగ్ర్భాంతి.. రహదారుల భద్రతపై కఠిన చర్యలు చేపట్టాలని సూచన
* ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలన్న BJP స్టేట్ చీఫ్ రామ్‌చందర్‌రావు
* జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో 58 మంది.. నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్న 23 మంది
* సినీ కార్మికుల సమస్యల పరిష్కారానికి టాలీవుడ్ ప్రముఖులతో ప్రభుత్వ ప్రత్యేక కమిటీ చర్చలు

News October 24, 2025

చల్కా భూములను సాగుకు అనువుగా ఎలా మార్చాలి?

image

చల్కా నేలల్లో లవణం, ఇసుక సమాన మోతాదులో ఉంటాయి. సేంద్రియ కర్బనం తక్కువగా.. ఐరన్, అల్యూమినియం ఆక్సైడ్‌లు ఎక్కువగా ఉండటం వల్ల సాగులో సమస్యలు వస్తాయి. ఈ భూముల్లో మొలక రాకపోవటం, వచ్చినా దెబ్బతినడం, మొక్కల సాంద్రత తగ్గుతుంది. ఈ భూముల్లో ఏటా ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువును పంట విత్తే ముందు వేసుకోవాలి. మల్చింగ్‌ వేయాలి. విత్తిన సాళ్ల వెంబడి పశువుల ఎరువును వేస్తే మొలక శాతం పెరుగుతుంది.