News October 22, 2025
మీ డబ్బు-మీ హక్కు పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్

మీ డబ్బు-మీ హక్కు అనే నినాదంతో భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా 3 నెలల పాటు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిందని కలెక్టర్ జి.రాజకుమారి అన్నారు. బుధవారం నంద్యాల కలెక్టర్ ఛాంబర్‌లో “మీ డబ్బు-మీ హక్కు” అనే గోడ పత్రికను విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా పౌరులు తమ పేర్లపై ఉన్న క్లెయిమ్ చేయని లేదా మరచిపోయిన ఆర్థిక ఆస్తులను తిరిగి పొందే అవకాశం కల్పించబడుతోందన్నారు.
Similar News
News October 22, 2025
జగిత్యాల: తీవ్ర జ్వరంతో ఏడేళ్ల చిన్నారి మృతి

జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందిన మల్యాల రవి కుమార్తె హృదయశ్రీ(7) తీవ్ర జ్వరంతో బాధపడుతూ బుధవారం సాయంత్రం మృతిచెందింది. పది రోజులుగా కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఆమె చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్న వయసులోనే హృదయశ్రీ మృతిచెందడంతో మల్యాల గ్రామంలో విషాదం నెలకొంది.
News October 22, 2025
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రవాణా చెక్‌పోస్టులు మూసివేత

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రవాణా చెక్‌పోస్టులు మూతపడనున్నాయి. సాయంత్రం 5 గంటలలోపు రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏ చెక్‌పోస్టులను, కార్యాలయాలను మూసివేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల ఏసీబీ దాడుల్లో అవినీతి బయటపడిన ముత్తగూడెం, పాల్వంచ చెక్‌పోస్టులతో సహా అన్ని కేంద్రాలు మూతపడనున్నాయి.
News October 22, 2025
ఇందిరమ్మ ఇళ్లపై మరో గుడ్‌న్యూస్

TG: 60 చదరపు గజాల కంటే తక్కువ స్థలం ఉంటే జీ+1 తరహాలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పట్టణ ప్రాంతాలవారికి ఈ ఆప్షన్ ఇచ్చింది. రెండు గదులతో పాటు కిచెన్, బాత్రూమ్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. గ్రౌండ్ ఫ్లోర్ స్థాయిలో రెండు విడతల్లో రూ.లక్ష చొప్పున, ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణంలో ఒకసారి రూ.2లక్షలు, చివరి విడతగా మరో రూ.లక్ష చెల్లించనున్నట్లు వెల్లడించింది.