News October 22, 2025

అనకాపల్లి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్

image

అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. రానున్న 2 రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో అనకాపల్లి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సహాయం కోసం 08924 88888, 08924 225999, 08924 226599 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. అదేవిధంగా డివిజన్, మండల స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలన్నారు.

Similar News

News October 23, 2025

సిరిసిల్ల: ‘అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం’

image

పోలీస్ అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకమని అదనపు ఎస్పీ చంద్రయ్య అన్నారు. సిరిసిల్లలోని పోలీస్ స్టేషన్ లో బుధవారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు పోలీసుల పనితీరు, ఆయుధాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యతో పాటు సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. సీఐ కృష్ణ, ఆర్ఐ యాదగిరి, ఎస్సైలు శ్రవణ్, దిలీప్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

News October 23, 2025

ఉపాధి హామీ పథకానికి నిధులు విడుదల

image

AP: ఉపాధి హామీ పథకానికి మెటీరియల్ కాంపోనెంట్ కింద 2025–26 ఏడాదికి మొదటి విడతగా కేంద్రం రూ.665 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.166 కోట్లు జత చేసింది. రాష్ట్రంలో పంచాయతీ భవనాల నిర్మాణం, రికార్డులు కంప్యూటరీకరణ, ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ నిమిత్తం రాష్ట్రీయ గ్రామ స్వరాజ్య అభియాన్(RGSA) ద్వారా రూ.50 కోట్లు నిధులు విడుదల చేసింది. వీటికి రాష్ట్రం రూ.33 కోట్లు జత చేయనుంది.

News October 23, 2025

తిరుపతి: రేపు స్కూళ్లకు సెలవు

image

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం అనగా 23వ తేదీన జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ప్రైవేట్ (Unaided) పాఠశాలలకు, అంగన్ వాడీలకు, జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటించడం జరిగిందని డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. డివైఈఓలు, ఎంఈఓలు, HMలు తమ పరిధిలోని ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఈ సమాచారాన్ని వెంటనే తెలియజేయవలసిందిగా ఆదేశించారు.