News October 22, 2025
ఆస్తులు పెరిగాయి కానీ.. ఉపాధి తగ్గింది

తయారీ రంగంపై ASI ఆసక్తికర అంశాలు వెల్లడించింది. FY24లో మిషనరీ, ల్యాండ్ ఇతర కేపిటల్ వ్యయం 12.6% పెరగ్గా ఉపాధి 7.8%కే పరిమితమైంది. పెరిగిన పోటీ, ఆధునిక సాంకేతికతతో యంత్రాలపై పెట్టుబడి పెరిగినట్లు పేర్కొంది. యంత్ర పరిశ్రమలో 12.9% ఉద్యోగాలు పెరగ్గా 29.7% పెట్టుబడి ఉన్న వస్త్రరంగంలో తగినంత ఉద్యోగ కల్పన కనిపించలేదంది. టెక్నాలజీ అభివృద్ధితో వీటి నిష్పత్తిలో వ్యత్యాసం తప్పదని నిపుణులు అభిప్రాయపడ్డారు.
Similar News
News October 25, 2025
నా కొడుకు వ్యాఖ్యలను వక్రీకరించారు: సిద్దరామయ్య

తన రాజకీయ జీవితంపై కొడుకు యతీంద్ర చేసిన <<18075196>>వ్యాఖ్యలను<<>> వక్రీకరించారని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. కాబోయే సీఎం ఎవరనే విషయమై కాకుండా విలువల గురించి తన కొడుకు మాట్లాడారని పేర్కొన్నారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై తాను ఇప్పుడే స్పందించనని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఈ విషయమై ఎవరితో మాట్లాడాలో వారితోనే మాట్లాడతానని చెప్పారు.
News October 25, 2025
విరాట్ త్వరగా ఫామ్‌లోకి రావాలి: రవిశాస్త్రి

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వీలైనంత త్వరగా ఫామ్‌లోకి రావాలని మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నారు. ‘జట్టులో పోటీ తీవ్రంగా ఉంది. రోహిత్, కోహ్లీ, ఎవరైనా రిలాక్స్ అవడానికి లేదు. ఫుట్‌వర్క్ విషయంలో విరాట్ కాస్త ఇబ్బంది పడుతున్నాడు. వన్డే క్రికెట్‌లో అతని రికార్డు అమోఘం. రెండు వన్డేల్లోనూ పరుగులు చేయకపోవడం కోహ్లీని నిరాశకు గురిచేసి ఉండవచ్చు’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
News October 25, 2025
నిరుద్యోగ బాకీ కార్డును ఆవిష్కరించిన హరీశ్ రావు

TG: ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగ JAC డిమాండ్ చేసింది. 2 లక్షల ఉద్యోగుల భర్తీ చేయాలంటూ నిరుద్యోగ బాకీ కార్డును బీఆర్ఎస్ నేత హరీశ్ రావు HYDలోని జలవిహార్‌లో ఆవిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసగించిందని ఆయన దుయ్యబట్టారు. రేవంత్ అన్ని విధాలుగా విఫలమయ్యారని ఫైరయ్యారు. మరోవైపు నిరుద్యోగులు BRS ట్రాప్‌లో పడొద్దని కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నారు.


