News October 22, 2025
ADB: ఆరోగ్య పాఠశాలపై కలెక్టర్ సమీక్ష

ADB కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆరోగ్య పాఠశాల సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజార్షి షా హాజరై ఆరోగ్య పాఠశాల కార్యక్రమ అమలుపై అధికారులకు సూచనలు చేశారు. మెరుగైన ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఆయన స్వయంగా ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ అజయ్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Similar News
News October 23, 2025
రాజ్యాంగ విలువలు వర్ధిల్లడం మునీర్‌కు ఇష్టం లేదు: ఇమ్రాన్ ఖాన్

సైనిక బలంతో వ్యవస్థలన్నీ నాశనం చేస్తున్నాడని PAK ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్‌పై ఆ దేశ మాజీ PM ఇమ్రాన్ ఖాన్ విరుచుకుపడ్డారు. చట్టబద్ధ పాలన, న్యాయం, రాజ్యాంగ విలువలు వర్ధిల్లడం ఆయనకు ఇష్టం లేదని ఎద్దేవా చేశారు. ప్రజల మద్దతు లేకుండా ఏ దేశమూ బలోపేతం కాదని చెప్పారు. తనను జైల్లో ఒంటరిగా ఉంచారని, కనీస సదుపాయాలు కూడా కల్పించలేదని మండిపడ్డారు. AFGతో ఉద్రిక్త పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.
News October 23, 2025
సిరిసిల్ల: ‘అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం’

పోలీస్ అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకమని అదనపు ఎస్పీ చంద్రయ్య అన్నారు. సిరిసిల్లలోని పోలీస్ స్టేషన్ లో బుధవారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు పోలీసుల పనితీరు, ఆయుధాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యతో పాటు సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. సీఐ కృష్ణ, ఆర్ఐ యాదగిరి, ఎస్సైలు శ్రవణ్, దిలీప్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
News October 23, 2025
ఉపాధి హామీ పథకానికి నిధులు విడుదల

AP: ఉపాధి హామీ పథకానికి మెటీరియల్ కాంపోనెంట్ కింద 2025–26 ఏడాదికి మొదటి విడతగా కేంద్రం రూ.665 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.166 కోట్లు జత చేసింది. రాష్ట్రంలో పంచాయతీ భవనాల నిర్మాణం, రికార్డులు కంప్యూటరీకరణ, ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ నిమిత్తం రాష్ట్రీయ గ్రామ స్వరాజ్య అభియాన్(RGSA) ద్వారా రూ.50 కోట్లు నిధులు విడుదల చేసింది. వీటికి రాష్ట్రం రూ.33 కోట్లు జత చేయనుంది.