News October 22, 2025

25 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు: నెల్లూరు కలెక్టర్

image

నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ నిరంతరం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్ల అన్నారు. 23 నుంచి 25 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాల ప్రభావం అధికంగా ఉండనున్న నేపథ్యంలో అధికారులను, ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలపై బుధవారం కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. తీర ప్రాంత మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.

Similar News

News October 23, 2025

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : వేమిరెడ్డి

image

జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. వర్షాల కారణంగా ప్రాణ నష్టం, పశు నష్టం జరగకుండా జిల్లా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. అనుకోని అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ముందు జాగ్రత్తగా అనువైన ఆశ్రయ కేంద్రాలకు తరలించాలన్నారు.

News October 22, 2025

కృష్ణపట్నంలో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక

image

బంగాళాఖాతంలో వాయుగుండం నేపథ్యంలో కృష్ణపట్నం పోర్టులో మూడో నెంబర్ ప్రమాద సూచికను ఎగురవేశారు. పోర్టుకు సమీపంలో తుఫాను ఉదృతి ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు. జిల్లాలోని తీర ప్రాంతాల్లో ముఖ్యంగా ఆరు మండలాల ప్రజలను మెరైన్ పోలీసులు అప్రమత్తం చేశారు. ఇప్పటికే పెన్నా నదికి వరద ఉదృతి పెరిగింది. ఈ నెల 25వ తేదీ వరకు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

News October 22, 2025

కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు: కలెక్టర్

image

భారీ వర్షాల నేపథ్యంలో అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోలు రూంను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. వర్షాల వలన ఇబ్బందులు తలెత్తితే కంట్రోలు రూం నెంబర్లు : 0861 2331261, 7995576699 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం తెలపవచ్చని కలెక్టర్ తెలిపారు.