News October 22, 2025

అల్పపీడన ప్రభావంతో హంసలదీవి బీచ్ గేట్లు మూసివేత..!

image

అల్పపీడన ప్రభావంతో హంసలదీవి బీచ్ గేట్లు మూసివేస్తున్నట్లు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నాగమణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం సముద్రపు అలలు ఎగిసిపడుతుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రేపటి నుంచి రెండు రోజులు పాటు పాలకాయతిప్ప వద్ద ఉన్న హంసలదీవి బీచ్ గేట్లు మూసివేస్తున్నామన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

Similar News

News October 25, 2025

అన్ని కార్తెలు తప్పినా హస్త తప్పదు

image

కార్తెల(నక్షత్రాలు) ప్రకారం రైతులు వర్షాన్ని అంచనా వేసేవారు. వర్షం కురిసే సీజన్‌కు సంబంధించిన అన్ని కార్తెలు తప్పిపోయినా, హస్త సమయంలో వర్షం తప్పకుండా పడుతుంది అనే నమ్మకాన్ని ఇది సూచిస్తుంది. సీజన్‌లో కురవాల్సిన వాన మిగతా కార్తెల్లో పడకపోయినా హస్తలో కచ్చితంగా పడుతుందని ఓ నమ్మకం. అందుకే రైతులు ఆ సందర్భంలో ఈ సామెతను వాడుతుంటారు.
(మీకు తెలిసిన వ్యవసాయ సామెతలను కామెంట్ చేయండి)

News October 25, 2025

‘బెల్ట్’ దందా.. ముందరుంది మేడారం జాతర..!

image

ములుగు జిల్లాలోని కొన్ని వైన్ షాప్‌లకు క్రేజ్ కొనసాగుతోంది. సమీపంలో మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరుండటం, బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతుండడంతో దుకాణాలను దక్కించుకునేందుకు సిండికేట్ వ్యాపారులు పోటీ పడ్డారు. జంగాలపల్లి షాపునకు 61 దరఖాస్తులు, మల్లంపల్లి 77, ఏటూరునాగారంలోని మూడు దుకాణాలకు 48, 49, 42, రామన్నగూడెం షాపునకు 48 దరఖాస్తులు వచ్చాయి. మేడారంలోని మూడు దుకాణాలకు 11, 12, 13 చొప్పున డీడీలు పడ్డాయి.

News October 25, 2025

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్.. ఖర్గేతో భేటీ!

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ చీఫ్ ఖర్గేతో ఆయన భేటీ కానున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకాలపై అధిష్ఠానం సీఎం అభిప్రాయాలను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులు, మంత్రుల మధ్య విభేదాలు, అంతర్గత అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ నెలాఖరు కల్లా డీసీసీ అధ్యక్షులను నియమించే అవకాశముంది.