News October 22, 2025

రష్మిక ‘థామా’ తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?

image

రష్మిక-ఆయుష్మాన్ ఖురానా లీడ్ రోల్స్‌లో ఆదిత్య సర్పోదర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘థామా’ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. వ్యాంపైర్ థీమ్ కావడంతో ఆడియన్స్‌లో మూవీపై అంచనాలు పెరిగాయి. దీంతో ఫస్ట్ డే కలెక్షన్స్‌పై ఆసక్తి నెలకొంది. ఈ మూవీ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.25.11 కోట్లు కలెక్ట్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది ధమాకా విజయమని నిర్మాణ సంస్థ మాడాక్ ఫిల్మ్స్ పేర్కొంది.

Similar News

News February 8, 2026

వాలంటైన్స్ డే.. భారీగా హోటల్ రూమ్ బుకింగ్స్

image

‘వాలంటైన్స్ డే’ అంటే ఒకప్పుడు పార్కులు, రెస్టారెంట్లలో సందడి నెలకొనేది. ఇప్పుడు ప్రేమజంటలు హోటల్ స్టేలకు మొగ్గు చూపుతున్నాయి. ఈ feb14కు గతేడాదితో పోలిస్తే హోటల్ బుకింగ్స్ 175% పెరిగాయని ట్రావెల్ సంస్థలు అంటున్నాయి. గువాహటి, కొలంబో, ఆగ్రా, జైపూర్, గోవా, మనాలి తదితర ప్రాంతాలకు డిమాండ్ అధికమని వెల్లడించింది. స్టేతో పాటు ప్రైవేట్ పార్టీలు, లంచ్-డిన్నర్ తదితర ఎక్స్‌పీరియన్స్‌ ప్రిఫర్ చేస్తున్నారట.

News February 8, 2026

BPNSIలో రూ. లక్షన్నర జీతంతో ఉద్యోగాలు

image

<>బిజు పట్నాయక్<<>> నేషనల్ స్టీల్ ఇన్‌స్టిట్యూట్ (BPNSI) 5 ట్రైనర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ME/MTech(మెకానికల్, మెటలర్జీ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్), BE/BTech అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఫిబ్రవరి 20 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. నెలకు జీతం రూ.1,50,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.bpnsi.org

News February 8, 2026

దేవుడు ఒక్కడేనా?

image

దైవం ఒక్కడే. కానీ ఆయన రూపాలు, నామాలు వేరు. మన స్వార్థం కోసం లాభనష్టాలను బేరీజు వేసుకుంటూ ఒక దైవాన్ని పూజిస్తూ, మరో దైవాన్ని కించపరచడం మహా దోషం. భూమి సారవంతమైతే ఏ విత్తనమైనా మొలకెత్తినట్లే, మన హృదయం పవిత్రంగా ఉంటే ఏ నామంతో పిలిచినా భగవంతుడు పలుకుతాడు. విలువలతో కూడిన జీవితం, పరోపకార భావన, సంపూర్ణ విశ్వాసమే దైవకృపకు అసలైన మార్గాలని పండితులు ప్రబోధిస్తున్నారు.