News October 22, 2025

వరల్డ్ క్లాస్ లైబ్రరీ కోసం శోభా గ్రూప్ ₹100 కోట్ల విరాళం

image

AP: ప్రపంచ అత్యుత్తమ నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని CM CBN పేర్కొన్నారు. దుబాయ్‌ పర్యటనలో ఆయనతో పలు సంస్థల ప్రతినిధులు భేటీ అయ్యారు. అమరావతిలో వరల్డ్ క్లాస్ లైబ్రరీకి ‘శోభా గ్రూప్’ ఛైర్మన్ మీనన్ ₹100 కోట్ల విరాళం ప్రకటించారు. రాజధాని నిర్మాణంలోనూ భాగస్వామ్యం కావాలని సీఎం ఆ సంస్థను కోరారు. అంతకు ముందు APలో పెట్టుబడులకు అవకాశాలపై భారత రాయబార కార్యాలయ ప్రతినిధులతో చర్చించారు.

Similar News

News October 25, 2025

1,149 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

image

ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 1,149 అప్రెంటిస్‌లకు దరఖాస్తు చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు NCVT/SCVT జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి. వయసు 15 నుంచి 24ఏళ్లు. రిజర్వేషన్ గల వారికి వయోపరిమితిలో సడలింపు ఉంది. టెన్త్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://ecr.indianrailways.gov.in/

News October 25, 2025

నేడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే..?

image

కుజ, కాల సర్ప దోషాలకు ఆదిదేవుడు సుబ్రహ్మణ్య స్వామి. అందుకే నాగుల చవితి రోజున ఆయనను ఆరాధించడం శుభకరమని పండితులు సూచిస్తారు. ఈ పర్వదినాన స్వామివారికి అభిషేకం చేసి, సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం ద్వారా దోషాలు తొలగి, ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయని అంటున్నారు. దేవాలయానికి వెళ్లలేనివారు ఇంట్లోనే ఆయనకు పూజలు చేస్తే.. పెళ్లి కానివారికి వివాహ యోగం, ఉద్యోగంలో అభివృద్ధి వంటి శుభాలు ప్రాప్తిస్తాయని అంటున్నారు.

News October 25, 2025

INDలో జూనియర్ హాకీ WC.. తప్పుకున్న PAK

image

భారత్ వేదికగా NOV 28 నుంచి జరగనున్న పురుషుల జూనియర్ హాకీ WC నుంచి PAK తప్పుకుంది. దీన్ని అంతర్జాతీయ హాకీ సమాఖ్య ధృవీకరించింది. భారతదేశంతో ఉద్రిక్తతల కారణంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. కాగా పాక్ వైదొలగడం గురించి తమకు తెలియదని, FIH ప్రకటన కోసం ఎదురు చూస్తున్నామని హాకీ ఇండియా తెలిపింది. AUGలో పురుషుల ఆసియా కప్ నుంచి సైతం PAK తప్పుకోగా బంగ్లాదేశ్‌తో ఆ స్థానాన్ని భర్తీ చేసి టోర్నీని కొనసాగించారు.