News October 22, 2025
భారీ వర్షాలపై మంత్రి గొట్టిపాటి సమీక్ష..!

భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బుధవారం సీఎండీలు, వివిధ జిల్లాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్ష ప్రభావిత ప్రాంతాలపై సమీక్షించారు. బాపట్ల జిల్లాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు కూలితే వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.
Similar News
News October 25, 2025
MBNR-డోన్ రైల్వే సెక్షన్ అప్‌గ్రేడేషన్‌కు ఆమోదం

MBNR-డోన్ రైల్వే సెక్షన్‌లో ఆధునిక 2×25 కిలోవోల్ట్ విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థ అమలు చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఈ మార్గం మరింత శక్తివంతమైన రైల్వే మార్గంగా మారనుంది. ఈ ప్రాజెక్ట్‌కు రూ.122.81 కోట్లు వ్యయం కానుంది. సుమారు 184 కిలోమీటర్ల రూట్ పొడవులో ప్రస్తుతం ఉన్న 1×25 KV వ్యవస్థను 2×25 KV సిస్టమ్‌గా అప్‌గ్రేడ్ చేయనున్నారు.
News October 25, 2025
1,149 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 1,149 అప్రెంటిస్‌లకు దరఖాస్తు చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు NCVT/SCVT జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి. వయసు 15 నుంచి 24ఏళ్లు. రిజర్వేషన్ గల వారికి వయోపరిమితిలో సడలింపు ఉంది. టెన్త్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://ecr.indianrailways.gov.in/
News October 25, 2025
నేడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే..?

కుజ, కాల సర్ప దోషాలకు ఆదిదేవుడు సుబ్రహ్మణ్య స్వామి. అందుకే నాగుల చవితి రోజున ఆయనను ఆరాధించడం శుభకరమని పండితులు సూచిస్తారు. ఈ పర్వదినాన స్వామివారికి అభిషేకం చేసి, సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం ద్వారా దోషాలు తొలగి, ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయని అంటున్నారు. దేవాలయానికి వెళ్లలేనివారు ఇంట్లోనే ఆయనకు పూజలు చేస్తే.. పెళ్లి కానివారికి వివాహ యోగం, ఉద్యోగంలో అభివృద్ధి వంటి శుభాలు ప్రాప్తిస్తాయని అంటున్నారు.


