News October 22, 2025

జూ.ఎన్టీఆర్ ఫొటోలు మార్ఫింగ్ చేసి..

image

TG: యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నేతలు హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిశారు. కొందరు ఎన్టీఆర్ ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన వివరాలు సమర్పించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా SMలో దుష్ప్రచారం చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని సీపీ స్పష్టం చేశారు.

Similar News

News October 25, 2025

దూసుకొస్తున్న తుఫాన్.. ఆ జిల్లాల్లో 2 రోజులు సెలవులు?

image

AP: రాష్ట్రానికి ‘మొంథా’ తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ ఏడాది ఇదే బలమైన తుఫాన్ అని, ఈ నెల 28 అర్ధరాత్రి లేదా 29 తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉందన్నారు. 26 నుంచి 4 రోజుల పాటు ఏపీకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా 28, 29 తేదీల్లో తీర ప్రాంత జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వాలని అధికారులు సూచించారు. నేడు, రేపు చాలాచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి.

News October 25, 2025

లవ్ మ్యారేజ్ చేసుకుంటా: అనుపమ

image

కెరీర్ ప్రారంభంలో ట్రోల్స్ వల్ల తాను బాధపడినట్లు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చెప్పారు. బిగినింగ్‌లో ఓ స్కూల్‌ ఈవెంట్‌కి వెళ్లిన ఫొటోలు వైరలవ్వగా డబ్బులిస్తే పాన్ షాపు ఈవెంట్లకూ వెళ్తారని తనపై ట్రోల్స్ వచ్చినట్లు ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు. లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అని ప్రశ్నించగా ఫ్యామిలీ అనుమతితో చేసుకుంటానని ఆమె బదులిచ్చారు. తాను ప్రత్యేకంగా ఎలాంటి డైట్ పాటించనని, నచ్చిన ఫుడ్ తింటానని చెప్పారు.

News October 25, 2025

1,149 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

image

ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 1,149 అప్రెంటిస్‌లకు దరఖాస్తు చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు NCVT/SCVT జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి. వయసు 15 నుంచి 24ఏళ్లు. రిజర్వేషన్ గల వారికి వయోపరిమితిలో సడలింపు ఉంది. టెన్త్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://ecr.indianrailways.gov.in/