News October 22, 2025

BRSకు ముందే తెలుసా?

image

TG: జూబ్లీ‌హిల్స్ ఉప ఎన్నిక వేళ BRS అభ్యర్థి మాగంటి సునీతపై ప్రద్యుమ్న అనే వ్యక్తి చేసిన <<18073070>>ఆరోపణలు<<>> వైరలవుతున్నాయి. ఇలాంటిది ఏదో జరిగి నామినేషన్ తిరస్కరణకు గురైతే ఇబ్బందులు తప్పవని BRS ముందుగానే ఊహించిందా? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌తో నామినేషన్ వేయించిదనే టాక్ విన్పిస్తోంది. ప్రద్యుమ్న ఆరోపణలపై సునీత గానీ, BRS గానీ ఇంకా స్పందించలేదు.

Similar News

News October 23, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 23, 2025

తెరపైకి గుమ్మడి నర్సయ్య జీవితకథ.. టైటిల్ రోల్‌లో స్టార్ హీరో

image

ప్రజానాయకుడు, సైకిల్‌పై అసెంబ్లీకి వెళ్లిన ఎమ్మెల్యేగా పేరున్న గుమ్మడి నర్సయ్య జీవిత కథ సినిమాగా రానుంది. ఈ చిత్రంలో టైటిల్ రోల్‌లో కన్నడ స్టార్ హీరో శివ‌రాజ్ కుమార్ నటిస్తున్నారు. ఈ మేరకు మూవీ యూనిట్ విడుదల చేసిన మోషన్ పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి పరమేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. గుమ్మడి నర్సయ్య తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు శాసనసభ నుంచి ఐదు సార్లు MLAగా ఎన్నికయ్యారు.

News October 23, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 23, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.58 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.11 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.12 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.49 గంటలకు
✒ ఇష: రాత్రి 7.02 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.