News October 22, 2025

NRPT: రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టు మూసివేత

image

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నారాయణపేట జిల్లా కర్ణాటక సరిహద్దులోని కృష్ణ చెక్ పోస్టు మూసివేసినట్లు జిల్లా రవాణా శాఖ అధికారి మేఘా గాంధి బుధవారం ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రవాణా చెక్ పోస్టులను మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసిందని, ఇవాళ సాయంత్రం 5గంటల నుంచి చెక్ పోస్టు మూసివేసినట్లు తెలిపారు. చెక్పోస్టుల దగ్గర ఉన్న బోర్డులు, బారికేడ్లు, సిగ్నేజ్, రికార్డుకు కార్యాలయానికి చేర్చినట్లు చెప్పారు.

Similar News

News October 25, 2025

మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు!

image

AP: టెన్త్ పరీక్షలు వచ్చే ఏడాది MAR 16 నుంచి నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. NOV 1వ తేదీ నుంచి నెల రోజుల పాటు ఫీజు చెల్లింపులకు అవకాశం కల్పించనున్నారు. ఈ ఏడాది కొత్తగా హాల్ టికెట్ల వెనక QR కోడ్ ఇవ్వనున్నారు. దాన్ని స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం రూట్ మ్యాప్‌ రానుంది. అటు చదువులో వెనకబడిన విద్యార్థుల కోసం 100డేస్ ప్రణాళికను DEC నుంచి అమలు చేయనున్నారు.

News October 25, 2025

20 వేలకు పైగా కేసులు.. కేవలం 5250 మందే చలానాలు కట్టారు!

image

ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా వాహనాలకు ఈ ఏడాది JAN 1 నుంచి OCT 22 వరకు 20,172 చలాన్లు విధించగా కేవలం ఇప్పటి వరకు 5255 మంది మాత్రమే ఫైన్ చెల్లించారు. వాహన చట్టాలు బలంగా లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది లేమి కలిసి సకాలంలో జరిమానాలకు వసూలు చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. NTR జిల్లాలోని ప్రైవేట్ బస్సులపై 624 కేసులు నమోదు కాగా… 288 బస్సులపై వేసిన చలాన్లను ఓనర్లు కట్టారు.

News October 25, 2025

డ్రగ్స్ కేసు.. సినీ నటులకు ఈడీ సమన్లు

image

డ్రగ్స్ కొనుగోలు కేసులో సినీ నటులు <<16798985>>శ్రీరామ్<<>>(శ్రీకాంత్), కృష్ణకు ఈడీ సమన్లు జారీ చేసింది. జూన్‌లో ప్రదీప్ కుమార్ అనే వ్యక్తికి మత్తు పదార్థాలు సప్లై చేసినందుకు జాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో వీరి హస్తం ఉందని విచారణలో తేలడంతో అరెస్టు చేయగా జుడీషియల్ రిమాండ్ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసు EDకి చేరడంతో ఈ నెల 28న శ్రీకాంత్, 29న నటుడు కృష్ణ దర్యాప్తునకు రావాలని కోరింది.