News October 22, 2025

సన్న రకానికి క్వింటాల్‌కు రూ. 500 బోనస్: అది శ్రీనివాస్

image

ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన సన్న రకం ధాన్యానికి క్వింటాల్‌కు అదనంగా రూ.500 బోనస్ అందిస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రకటించారు. బుధవారం చందుర్తి మండలం, సనుగుల గ్రామంలో జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి ఆయన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఖరీఫ్ సీజన్‌లో సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

Similar News

News October 23, 2025

NLG: నేడే లాస్ట్.. ఇప్పటివరకు అందిన దరఖాస్తులు 4653!

image

నల్గొండ జిల్లాలో మద్యం దుకాణాలకు బుధవారం మరో 24 దరఖాస్తులు అందినట్లు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి సంతోశ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 154 మద్యం దుకాణాలు ఉండగా.. నేటి వరకు 4,653 దరఖాస్తులు అందాయని తెలిపారు. కొత్త మద్యం దుకాణాల లైసెన్స్ దరఖాస్తుల గడువు నేటితో ముగిస్తుందని తెలిపారు.

News October 23, 2025

మేడ్చల్ ఘటనపై బండి సంజయ్ ఫైర్

image

TG: గోరక్షాదళ్ సభ్యుడు సోనూసింగ్‌పై <<18077269>>దాడిని<<>> కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఖండించారు. ఎంఐఎం రౌడీలకు కాంగ్రెస్ ఆశ్రయం ఇస్తే ఇలాంటి ఘటనలే జరుగుతాయని ధ్వజమెత్తారు. గోభక్తులపై దాడులకు పాల్పడే సంఘ విద్రోహ శక్తులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. మరోవైపు దాడిని వ్యతిరేకిస్తూ ఇవాళ డీజీపీ ఆఫీసు ఎదుట నిరసన చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావు తెలిపారు.

News October 23, 2025

12 వేల మంది పోలీసుల భద్రత వలయంలో మేడారం..!

image

మేడారం మహా జాతరలో ఎన్ని ప్రభుత్వ శాఖలు పనిచేసినా పోలీసు డిపార్ట్‌మెంట్‌దే ప్రధాన పాత్ర. శాంతి భద్రతల పరిరక్షణ, అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాతరను జరిపించడంలో ఖాకీలే కీలకం. సమ్మక్క, సారలమ్మలను గద్దెకు చేర్చే ఘట్టం యావత్ జాతరకే హైలెట్. ట్రాఫిక్ క్లియరెన్స్, దొంగతనాల నియంత్రణ అతి పెద్ద టాస్క్‌లు. ఇలాంటి క్లిష్టమైన విధుల్లో ఉండే పోలీసులు ఈసారి 12 వేల మంది జాతర విధుల్లో భాగస్వాములు కానున్నారు.