News October 22, 2025
JMKT: క్వింటా పత్తి గరిష్ఠ ధర రూ.7,050

నాలుగు రోజుల విరామం అనంతరం బుధవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభమైంది. రైతులు 44 వాహనాల్లో 330 క్వింటాళ్ల పత్తిని విక్రయానికి తీసుకురాగా, దీనికి గరిష్ఠంగా క్వింటాకు రూ.7,050 పలికింది. గోనె సంచుల్లో తీసుకొచ్చిన 13 క్వింటాళ్ల పత్తికి గరిష్ఠంగా రూ.5,700 ధర లభించింది. మార్కెట్ కార్యకలాపాలను ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం పరిశీలించారు. తాజాగా పత్తి ధర గత వారం కంటే రూ.250 పెరిగింది.
Similar News
News October 23, 2025
ప్రతి జిల్లాలో కంట్రోల్ రూములు: అనిత

AP: దక్షిణకోస్తా, రాయలసీమలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున సహాయక బృందాలను సిద్ధంగా ఉంచామని హోంమంత్రి అనిత తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించినట్లు వివరించారు. నెల్లూరు, PKS, KDP, TPT జిల్లాల్లో NDRF, SDRF బృందాలు అందుబాటులో ఉంచామన్నారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.
News October 23, 2025
సిద్దిపేట: డిసెంబర్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు: మంత్రి వివేక్

డిసెంబర్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. బుధవారం అక్బర్ పేట భూంపల్లి మండలంలో ఆయన మాట్లాడుతూ.. 17 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమే లక్ష్యమని చెప్పారు. నిబంధనలకు లోబడి కట్టిన వారికి మాత్రమే డబ్బులు వస్తాయన్నారు. డిసెంబర్‌లో మరిన్ని ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని తెలిపారు. దుబ్బాక నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని వెల్లడించారు.
News October 23, 2025
NLG: నేడే లాస్ట్.. ఇప్పటివరకు అందిన దరఖాస్తులు 4653!

నల్గొండ జిల్లాలో మద్యం దుకాణాలకు బుధవారం మరో 24 దరఖాస్తులు అందినట్లు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి సంతోశ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 154 మద్యం దుకాణాలు ఉండగా.. నేటి వరకు 4,653 దరఖాస్తులు అందాయని తెలిపారు. కొత్త మద్యం దుకాణాల లైసెన్స్ దరఖాస్తుల గడువు నేటితో ముగిస్తుందని తెలిపారు.