News October 22, 2025
సిరిసిల్ల: 108 అంబులెన్స్‌లలో ఆకస్మిక తనిఖీలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 108 అత్యవసర అంబులెన్స్ వాహనాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా మేనేజర్ జనార్దన్, సిరిసిల్ల జిల్లా మేనేజర్ అరుణ్ కుమార్ తో కలిసి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు అంబులెన్స్‌లలోని ఆక్సిజన్ నిల్వలు, వెంటిలేటర్, మానిటర్, మందుల ఎక్స్‌పైరీ, వాహనాల కండిషన్తో పాటు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తనిఖీల్లో 108 సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News October 23, 2025
సహకార సంస్థలు తమ డేటాను అందించాలి: కలెక్టర్

జిల్లాలో ఉన్న సహకార సంస్థలు తమ డేటాను జిల్లా సహకార అధికారికి అందించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్‌లో కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. డేటాను నేషనల్ కో-ఆపరేటివ్ డేటా బేస్ పోర్టల్లోఅప్డేట్ చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో 19,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోడౌన్ స్పేస్ అందుబాటులో ఉందని, వినియోగంలోకి తేవాలని సూచించారు.
News October 23, 2025
ప్రతి జిల్లాలో కంట్రోల్ రూములు: అనిత

AP: దక్షిణకోస్తా, రాయలసీమలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున సహాయక బృందాలను సిద్ధంగా ఉంచామని హోంమంత్రి అనిత తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించినట్లు వివరించారు. నెల్లూరు, PKS, KDP, TPT జిల్లాల్లో NDRF, SDRF బృందాలు అందుబాటులో ఉంచామన్నారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.
News October 23, 2025
సిద్దిపేట: డిసెంబర్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు: మంత్రి వివేక్

డిసెంబర్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. బుధవారం అక్బర్ పేట భూంపల్లి మండలంలో ఆయన మాట్లాడుతూ.. 17 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమే లక్ష్యమని చెప్పారు. నిబంధనలకు లోబడి కట్టిన వారికి మాత్రమే డబ్బులు వస్తాయన్నారు. డిసెంబర్‌లో మరిన్ని ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని తెలిపారు. దుబ్బాక నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని వెల్లడించారు.