News October 22, 2025

విద్యుత్ కనెక్షన్ల జారీ సరళతరం: CMD పృథ్వీతేజ్

image

కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీ ప్రక్రియను సరళతరం చేశామని APEPDCL CMD పృథ్వీతేజ్ తెలిపారు. ‌ఇకపై వినియోగదారులు ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు. ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్, ఎస్టిమేట్ తయారీ అవసరం లేదన్నారు. 150 కిలోవాట్ వరకు ఫిక్స్‌డ్ కనెక్షన్ ఛార్జీలు ఉంటాయన్నారు. దరఖాస్తు సమయంలోనే వినియోగదారుడికి చెల్లించాల్సిన మొత్తం స్పష్టంగా తెలుస్తుందని దీంతో కనెక్షన్ జారీ వేగవంతమవుతుందన్నారు.

Similar News

News October 23, 2025

జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ పలు అభివృద్ధి పనులకు ఆమోదం

image

జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం మేయర్ సమక్షంలో బుధవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో 205 ప్రధాన అంశాలు, 12 టేబుల్ అజెండాలతో మొత్తం 217 అంశాలు పొందుపరిచారు. వాటిలో 4 అంశాలను వాయిదా వేసి 213 అంశాలకు ఆమోదం తెలిపారు. గాజువాక ప్రాంతానికి చెందిన స్నేక్ క్యాచర్ కిరణ్‌పై అవినీతి ఆరోపణలు వస్తున్నందున అతనిని విధుల నుంచి తొలగించాలని స్థాయి సంఘం సభ్యులు అధికారులకు సూచించారు.

News October 22, 2025

విశాఖ రైతు బజార్లలో డ్రా ద్వారా 129 మందికి స్టాల్స్ మంజూరు

image

విశాఖలోని రైతు బజార్లలో స్టాల్స్ కేటాయింపుల కోసం డ్రా నిర్వహించారు. దరఖాస్తు చేసిన వారిలో 129 మంది రైతులకు రైతు కార్డులు మంజూరు చేసినట్లు జేసీ మయూర్ అశోక్ తెలిపారు. డ్రా ప్రక్రియను కలెక్టరేట్‌లో అధికారులు, రైతుల సమక్షంలో నిర్వహించారు. ఎంపికైన వారికి త్వరలో రైతు బజార్లలో స్టాల్స్ కేటాయించనున్నారు.

News October 22, 2025

గవర్నర్‌కు స్వాగతం పలికిన జిల్లా అధికారులు

image

రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ 2 రోజుల పర్యటన నిమిత్తం బుధవారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్‌లో ఆయనకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చి,ఇతర అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి పీఎంపాలెం వెళ్లారు.