News October 23, 2025
ఖమ్మం: బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో సీట్ల భర్తీ

జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో డ్రాపౌట్‌ల ద్వారా ఏర్పడిన 40 సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ అభివృద్ధి అధికారి శ్రీలత తెలిపారు. 3, 4, 6, 7, 8, 9వ తరగతుల్లో రెసిడెన్షియల్, నాన్-రెసిడెన్షియల్ విభాగాల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తిగల విద్యార్థులు నవంబరు 2వ తేదీలోపు కలెక్టరేట్‌లోని ఎస్-27 విభాగంలో సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
Similar News
News October 23, 2025
రెడ్ అలర్ట్.. ఫ్లాష్ ఫ్లడ్స్‌కు అవకాశం

AP: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలో అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కోస్తాంధ్ర, యానాంతో పాటు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ (ఆకస్మిక వరదలు) వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు ఈ నెల 25-28 మధ్యలో మరో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉంది.
News October 23, 2025
జూబ్లీహిల్స్‌లో ప్రచారం.. ప్రతి పైసా లెక్క చెప్పాలి!

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో అభ్యర్థులు ప్రచారం కోసం చేసే ప్రతి పైసాను లెక్కించి అభ్యర్థుల ఖాతాలో జమ చేయాలని వ్యయ పరిశీలకులు సంజీవ్ కుమార్ లాల్ అధికారులకు సూచించారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంసీఎంసీ, ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ రూమ్‌లను తనిఖీ చేశారు. అభ్యర్థుల పెయిడ్ న్యూస్‌పై నిఘా ఉంచాలన్నారు. ర్యాలీలు, సభలు, రోడ్ షోలను రికార్డింగ్ చేయాలన్నారు.
News October 23, 2025
3,800 దరఖాస్తులు పెండింగ్‌పై జేసీ రాహుల్‌రెడ్డి ఆగ్రహం

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న జాయింట్ ఎల్‌పీఎం దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం క్యాంప్ కార్యాలయం నుంచి రీ-సర్వే, హౌసింగ్ ఫర్ ఆల్, పీజీఆర్ఎస్ పిటిషన్ల పరిష్కారాలపై ఆయన గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో ఇంకా 3,800 జాయింట్ ఎల్‌పీఎంలు పెండింగ్ ఉండటంపై జేసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు.