News October 23, 2025
ములుగు: ఇకనుంచి జరిమానా కాదు.. వాహనం సీజ్!

అక్రమ వసూళ్లకు ఆర్టీవో చెక్ పోస్ట్‌లు కేరాఫ్‌గా మారాయనే ఆరోపణల నేపథ్యంలో వాటిని నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఎత్తివేసింది. అయితే, ములుగు(D)లో మొదటినుంచి ఒక్క చెక్ పోస్ట్ లేదు. ఛత్తీస్‌గఢ్‌తో సరిహద్దును పంచుకుంటున్న జిల్లా మీదుగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిషా, ఏపీ వాహనాలు వచ్చిపోతుంటాయి. నిఘాను పెంచిన అధికారులు పర్మిట్ లేకుంటే ఇకనుంచి జరిమానా కాకుండా ఏకంగా వాహనాన్ని సీజ్ చేయనున్నారు.
Similar News
News October 23, 2025
MBNR: జర్మనీలో ఉద్యోగాలు.. రేపు శిక్షణ

MBNR ప్రభుత్వ ఐటిఐ బాలుర క్యాంపస్‌లోని ఏటీసీ భవనంలో జర్మన్ భాషా శిక్షణ(A2 స్థాయి శిక్షణ) నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శాంతయ్య Way2Newsతో తెలిపారు. ఈ శిక్షణ రేపు రాష్ట్ర ప్రభుత్వ సంస్థ తెలంగాణ ఓవర్సీస్ మాన్ పవర్ కంపెనీ లిమిటెడ్(TOMCOM) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని, జర్మనీలో ఉద్యోగాలు, ప్రయోజనాల గురించి వివరిస్తామని, ఎలక్ట్రిషన్ ట్రేడ్ లో 60% మార్కులు ఉండాలని, వయస్సు 19-30లోపు ఉండాలన్నారు.
News October 23, 2025
బాడీలోషన్నే ముఖానికి వాడుతున్నారా?

చర్మానికి తేమను అందించడానికి చాలామంది బాడీలోషన్ వాడుతుంటారు. కానీ కొంతమంది ఈ లోషన్నే ఫేస్‌కి కూడా వాడుతుంటారు. దీనివల్ల ముఖంపై మొటిమలు పెరుగుతాయంటున్నారు నిపుణులు. ఇందులో వాడే కృత్రిమ పరిమళాలు మృదువుగా ఉండే ముఖ చర్మంపై అలర్జీలు రావడానికి కారణం అవుతుందంటున్నారు. కాబట్టి ముఖం కోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఉత్పత్తులను వాడాలని సూచిస్తున్నారు.
News October 23, 2025
కడప జిల్లా నుంచి ఆలయాలకు ప్రత్యేక బస్సులు

కార్తీకమాసం సందర్భంగా భక్తులు శైవ క్షేత్రాలను దర్శించేందుకు కడప జిల్లాలోని 6 డిపోల పరిధిలో 100 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజినల్ మేనేజర్ గోపాల్‌రెడ్డి తెలిపారు. ఈ బస్సులు ఈనెల 27 నుంచి వచ్చేనెల 3, 10, 17తేదీల్లో పొలతల క్షేత్రం, నిత్యపూజ కోన, లంకమల్ల, అగస్తీశ్వర కోన, కన్యతీర్థం, నయనాలప్ప కోన, పుష్పగిరి, శ్రీశైలం తదితర క్షేత్రాలకు బస్సు సర్వీసులు భక్తులకు అందుబాటులో ఉంటాయన్నారు.